Cockroach: వర్షాకాలం ప్రారంభమైన తరువాత వ్యాధులు ఒక్కొక్కటి విజృంభిస్తాయి. ముఖ్యంగా వైరల్ ఫ్లూ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ ఫ్లూ విస్తరించడానికి కీటకాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపచేస్తాయి. దీంతో ఒకరి తరువాత ఒకరికి వ్యాధులు సంక్రమిస్తాయి. అయితే వ్యాధులను వ్యాప్తి చేసేవాటిలో దోమలు, ఈగలు ఎక్కువగా పనిచేస్తాయి. ఇటీవల కాలంలో బొద్దింకలు కూడా వాహకాలుగా పనిచేస్తాయా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. చాలా ఇళ్లల్లో ఇటీవల బొద్దింకలతో బాధపడుతున్నాం.. అనే వార్తలు వింటున్నాం. వీటిని నిరోధించడానికి క్రిమి సంహారక స్ప్రేలు వాడుతున్నారు. కానీ అవి తాత్కాలికమే అని గ్రహించాలి. అయితే వీటి ద్వారా ఎలాంటి వ్యాధులు వస్తాయి? ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
దోమలు, ఈగలు చాల చిన్నవిగా ఉంటాయి. వీటిని పట్టుకోవడం సాధ్యం కాదు. కానీ ఇవి పెద్ద పెద్ద వ్యాధులను సంక్రమింపజేస్తాయి. బొద్దింకల సైజు వీటి కంటే ఎక్కువ. ఇవి కనిపిస్తే తీసి బయట పారేయవచ్చు. కానీ కొన్ని ఇళ్లల్లో చాలా వరకు బొద్దింకలు ఉంటాయి. అంతేకాకుండా ఇవి సీక్రెట్ ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే బయటకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే వీటి వల్ల ప్రమాదం ఉందా? నేరుగా లేకపోయినా ఇవి ప్రమాదాన్ని తీసుకొస్తాయని చెప్పవచ్చు.
బొద్దింకల వల్ల నేరుగా మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు అని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎంటమాలజీ నిపుణులు చెబుతున్నారు. కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం ఇవి మనుషులకు హాని చేయలేవు. కానీ ఇంట్లోనే ఉండే కొన్ని బ్యాక్టీరియాలను తీసుకొచ్చి ఆహార పదార్థాలపై పడేస్తాయి. వీటిని మనుషులు చూసుకోకుండా తినడం వల్ల ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. అంటే బొద్దింకల వాహకాలు కాకపోయినా.. వాటిద్వారా క్రిములు చేరే ప్రమాదం ఉంది. వీటి వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇంట్లో కుళ్లిన ఆహారంపై ఎక్కువగా బొద్దింకలు సంచరిస్తాయి. ఆ తరువాత మనం తినే ఆహారంపైకి ఇవి రావడంతో క్రిములను పడేస్తాయి. దీంతో అనేక రోగాలకు దారి తీయొచ్చు. అందువల్ల ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని బొద్దింకలను రాకుండా చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో కుళ్లిన ఆహార పదార్థాలను ఉంచకుండా వెంటనే పారేయడం మంచిది. బొద్ధింకలు ఎక్కువగా కిటికీలు, తలుపుల నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ ఉండే చిన్న చిన్న రంధ్రాలను మూసి ఉంచాలి. ఇక డిష్ వాషర్లలో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. ఆ ప్రదేశంలో ఆహార పదార్థాలు లేకుండా చూసుకోవాలి,