https://oktelugu.com/

Pimples: నుదుటిపై.. చెంపపై.. ఇలా రకరకాల మొటిమలకు కారణాలేంటి?

సాధారణంగా మొటిమలు స్ట్రెస్ ఎక్కువగా ఉంటే వస్తాయని అంటారు. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మొటిమలు రావడానికి కారణమవుతారు. అంతేకాకుండా హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ గా ఉండడం వల్ల కూడా మొటిమలు వస్తాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 18, 2025 / 11:15 PM IST
    Pimples

    Pimples

    Follow us on

    Pimples: ప్రతి ఒక్కరికి తాము అందంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల మోహంపై మొటిమలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమస్య ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు రాగానే ముఖ్యంగా యువతులు చాలా నిరాశతో ఉంటారు. ఇవి పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇవి శరీరంలో జరిగే రసాయన క్రియ వల్ల ఏర్పడుతాయి. అయితే కొందరికి మోహంపై మొటిమలు వస్తే.. మరికొందరికి ముక్కుపై కనిపిస్తాయి. ఇంకొందరికి చెవులపై మరికొందరికి చేతులపై మొటిమలు కనిపిస్తాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మొటిమలు రావడానికి కారణాలేంటి? అలా ఎందుకు వస్తాయి? ఇలా వస్తే సంకేతం ఏంటి?

    సాధారణంగా మొటిమలు స్ట్రెస్ ఎక్కువగా ఉంటే వస్తాయని అంటారు. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మొటిమలు రావడానికి కారణమవుతారు. అంతేకాకుండా హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ గా ఉండడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో వాటి లెవెల్స్ పెరిగిపోతాయి. ఎక్కువ సేపు మెలకువతో ఉన్నా.. ఇవి కనిపిస్తాయి. దీంతో ఒకరికి తెలియకుండానే మొటిమలు వస్తాయి. అయితే ఇవి ఎక్కువ రోజులు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచింది.

    మొటిమలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తాయి. చాలా మందికి నుదుటిపై పింపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రావడానికి జీర్ణ సమస్యలే కారణం. ఆ వ్యకి తినే ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ మొటిమలు కనిపిస్తాయి. అలాగే గడ్డం వచ్చే ప్రదేశంలో ఎక్కువగా మొటిమలు రావడానికి కారణం హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ గా ఉండడం. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా ఈ మొటిమలు వస్తూ ఉంటాయి.

    ఇక చాలా మందికి చెంపపై ఎక్కువగా మొటిమలు రావడం గమనిస్తూ ఉంటాం. ఇవి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. శరీరంలో చక్కెర శాతం పెరిగడం, ఒకే సైడ్ నిద్రించడం , లేదా డర్టీ ఫిల్లోస్ వాడడం, ఫోన్ ఎక్కువగా వాడడం వంటి కారణాలు ఉన్నాయి. ఇలాంటి వారికి చెంపపై ఎక్కువగా మొటిమలు కనిపిస్తూ ఉంటాయి.

    కొందరికి హైబ్రోస్ పై మొటిమలు కనిపిస్తాయి. ఇక్కడ వస్తున్నాయంటే వీరికి లివర్ సమస్య ఉందని తెలుసుకోవాలి. అలాగే తక్కువ నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని గుర్తించాలి. ముక్కుపై ఎక్కువగా మొటిమలు వస్తున్నాయంటే వారి శరీరంలో హార్మోనల్స్ మార్పులు ఉన్నాయని తెలుసుకోవాలి. అలాగే చెవులపై మొటిమలు రావడానికి కూడా హార్మోన్ల మార్పు కారణమని కొందరు స్కిన్ స్పెషలిస్టులు తెలుపుతున్నారు. అయితే ఎక్కడ మొటిమలు వచ్చినా .. కొద్ది రోజులకు కనిపించకుండా పోతే పర్వా లేదు. కానీ. ఇవి ఎక్కువ రోజులు స్కిన్ పై ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకుంటే రాను రాను తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే మార్పుల కారణంగానే ఈ మొటిమలు వస్తాయి అనేది తెలుసుకోవాలి.