Salt Water: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారంపై దృష్టి పెడుతున్నారు. అయితే నీళ్లలో ఉప్పును వేసుకుని తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనం ప్రస్తుతం వినియోగిస్తున్న ఉప్పు శుద్ధి చేసిన ఉప్పు అనే సంగతి తెలిసిందే. సాల్ట్ వాటర్ ను ఎవరైతే తాగుతారో వాళ్లకు ఆరోగ్యంగా నిద్ర పడుతుంది. అజీర్తి సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు బ్లాక్ సాల్ట్ వాటర్ లో వేసుకుని తాగితే మంచిదని చెప్పవచ్చు.
ఉప్పులో నీళ్లు వేసుకుని తాగితే ఆస్తమా సమస్య దూరమవుతుంది. సాల్ట్ వాటర్ తాగడం వల్ల పొట్ట, ప్రేగులు శుభ్రమవుతాయి. రక్తపోటు తక్కువగా ఉంటే నీళ్లలో ఉప్పు వేసుకుని తాగడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. డీ హైడ్రేషన్ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు సాల్ట్ వాటర్ తాగడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. ఉప్పునీటిని పుక్కిలించడం ద్వారా దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఉప్పునీటిని ప్రతిరోజూ పుక్కిలించడం ద్వారా నోట్లో ఉన్న బ్యాక్టీరియాకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఆస్తమా సమస్యతో బాధ పడేవాళ్లు సాల్ట్ వాటర్ ను తాగడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ సాల్ట్ వాటర్ తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.