Wax Gourd Juice Benefits: మనం ఇళ్లకు దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయను కట్టుకుంటాం. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుందని నమ్ముతుంటాం. కానీ ఆయుర్వేదంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పలు రోగాలకు ఇది మందులా ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. దీని జ్యూస్ తాగితే మన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అందుకే దీన్ని మనం విరివిగా వాడుకోవచ్చు. కూరగా చేసుకుని తినవచ్చు. జ్యూస్ చేసుకుని తాగవచ్చు. రెండు రకాలుగా మనకు సాయపడుతుంది.
డీటాక్స్ చేయడంలో..
బూడిద గుమ్మడికాయ మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఆరోగ్యం బాగుపడుతుంది. దీని జ్యూస్ తాగడం వల్ల అంతర్గత వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి శరీరానికి బలం చేకూరుస్తాయి. మలవిసర్జన సమస్య దూరమవుతుంది. ఇన్ని రకాల మనకు మేలు చేసేదిగా ఉంటుంది.
డ్రగ్స్ అలవాటును దూరం చేస్తుంది
ఇటీవల చాలా మంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. అలాంటి అలవాటును కూడా ఇది దూరం చేస్తుంది. బూడిద గుమ్మడికాయను పొడిగా చేసుకుని కొబ్బరినీళ్లు, నిమ్మరసం, ఉసిరి రసంతో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా పోతాయి. మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న వారు ఇక వాటి జోలికి వెళ్లకుండా చేస్తుంది. ఇలా బూడిద గుమ్మడికాయ మనకు చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది.
ఎసిడిటిని..
ఇందులో ఉండే అల్కలాయిడ్ ఎసిడిటిని తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టేందుకు సాయపడుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు ఉబ్బరంకు విరుగుడుగా పనిచేస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇలా ఇన్ని రకాల లాభాలు ఉన్నందున బూడిద గుమ్మడికాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ఉత్తమం. రోజుకు రెండు సార్లు బూడిద గుమ్మడికాయ రసం తాగితే జీవితంలో ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రసం తాగడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుని వాడుకోవడం మంచిది.