Homeలైఫ్ స్టైల్Watermelon Health Benefits In Summer: ఈ కాయ వేసవిలో ఉష్ణోగ్రతను తొలగించే దివ్య ఔషధం..

Watermelon Health Benefits In Summer: ఈ కాయ వేసవిలో ఉష్ణోగ్రతను తొలగించే దివ్య ఔషధం..

Watermelon Health Benefits In Summer: వేసవికాలం రాగానే చల్లదనం కోసం చాలామంది అనేక రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. వీటిలో శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించే పండ్లను తీసుకోవడం చాలా అవసరం. అయితే వేసవి కాలం రాగానే మార్కెట్లో ఎక్కువగా పుచ్చకాయలు విరివిగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది వీటిని చూస్తూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇందులో ఉండే పోషకాలు తెలుసుకోవడం వల్ల ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకుంటారు. అంతేకాకుండా పుచ్చకాయలను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ పుచ్చకాయల వల్ల ఎలాంటి లాభాలో ఇప్పుడు చూద్దాం..

వేసవిలో శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా నీరు తాగే ఆసక్తి ఉండదు. అయితే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలోకి అదనపు నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో 92 శాతం నీటి కంటెంట్ ను కలిగిన పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరంలో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా శరీరం డిహైడ్రేటుకు గురయ్యే సమస్యలు తక్కువగా ఉంటాయి. వేసవిలో ఎక్కువగా చెమట రావడం వల్ల శరీరంలోని నీరు బయటకు వెళ్తుంది. దీంతో తొందరగా అలసట అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఉదయమే పుచ్చకాయ తీసుకోవడం వల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది.

పుచ్చకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వేసవిలో ఎలాంటి బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా ఇది కాపాడుతుంది. అంతేకాకుండా ఆహారానికి సమానంగా ఇది శక్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది. మూత్ర సంబంధిత సమస్యలకు పుచ్చకాయ ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వేసవిలో మూత్రం మంటగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య నివారణకు పుచ్చకాయ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఇస్తుంది. అలాగే వేసవిలో మలబద్ధకంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువే. ఇలాంటివారు సైతం పుచ్చకాయ తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.

చాలామంది బరువు తగ్గాలని అనుకునేవారు పుచ్చకాయను తినడం వల్ల సరైన ఫలితాలను పొందుతారు. ఎందుకంటే పుచ్చకాయ తినడం వల్ల ఆహారం తిన్న ఫీలింగ్ అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకపోయినా శరీరంలో శక్తి ఉంటుంది. అంతేకాకుండా దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. కంటిచూపు సమస్యలను కూడా దూరం చేసే ఈ పుచ్చకాయ తినడం వల్ల మానసికంగా కూడా ప్రశాంతత నెలకొంటుంది. వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివారు పుచ్చకాయ గుజ్జు, శరీరానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారే అవకాశం ఉంటుంది. కొంతమంది పుచ్చకాయ తినేటప్పుడు ఇందులోని గింజలను బయట పాడేస్తారు. కానీ ఈ గింజల్లోనూ విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అయితే పుచ్చకాయ గింజలు డైరెక్ట్ గా తినడం ఇష్టం లేనివారు వీటిని వేయించుకొని తినొచ్చు. ఈ విధంగా పుచ్చకాయలు అనేక పోషకాలు నిల్వ ఉంటాయి. అందువల్ల వేసవిలో కచ్చితంగా పుచ్చకాయ తినే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version