ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరంతో బాధపడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా చాలామంది డెంగీతో బాధ పడుతున్నారు. డెంగీ బారిన పడిన వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులలో డెంగీ ఒకటని చెప్పవచ్చు. ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
ఏడిస్ ఈజిఫ్ట్ జాతి దోమల ద్వారా డెంగీ బారిన పడే ఛాన్స్ ఉంటుంది. డెంగీ బారిన పడిన వాళ్లలో చాలామందికి ప్లేట్ లెట్స్ తగ్గిపోయి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్లేట్ లెట్స్ ను సులభంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. పండ్లు, కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్ లెట్స్ ను సులభంగా పెంచుకునే ఛాన్స్ ఉంటుంది.
డెంగీ వ్యాధి వచ్చిన తర్వాత రెండు రోజుల నుంచి ఏడు రోజుల వరకు లక్షణాలు ఉంటాయి. డెంగీ బాధితులు జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడే ఛాన్స్ ఉంటుంది. దానిమ్మ పండ్లు తినడం, బొప్పాయి ఆకులను తినడం, గోధుమ గడ్డిని రసం చేసుకుని తాగడం, ఎండు ద్రాక్ష తినడం, క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తాగడం ద్వారా ప్లేట్ లెట్లను పెంచుకోవచ్చు.
విటమిన్ సి ఫుడ్ తీసుకోవడం, విటమిన్ కె ఫుడ్ తీసుకోవడం, అరటిపండ్లు తినడం ద్వారా ప్లేట్ లెట్స్ ను పెంచుకోవచ్చు. అరటిపండ్లు తినడం ద్వారా కూడా ప్లేట్ లెట్లను సులువుగా పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.