Earwax : చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చెవిలో గులిమి వల్ల ఇబ్బంది పడుతుంటారు. చాలామంది కాటన్ బడ్స్ సహాయంతో గులిమిని తొలగించుకుంటారు. చెవిలో గులిమి ఎక్కువగా తయారు కావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పిన్నీసులు, అగ్గిపుల్లలకు దూదిని ఉంచి చెవులలో గులిమిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిన్నీసులు, పదునైన వస్తువుల వల్ల చెవులలోని సున్నితమైన ప్రదేశాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.
చెవులలోని లోపలి గ్రంథుల వల్ల గులిమి ఉత్పత్తి అవుతుందనే సంగతి తెలిసిందే. గులిమిలో శరీరానికి ఉపయోగపడే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. గులిమి వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గులిమి వల్ల చెవులు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటాయి. చెవులలో పగుళ్లు రాకుండా, చెవులలోని నాళాలను ఎండిపోకుండా చేయడంలో గులిమి తోడ్పడుతుంది.
Also Read: మెంతి ఆకులతో ఆ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్.. ఎలా అంటే?
గులిమిని తొలగించుకోకపోయినా మనం మాట్లాడే సమయంలో దవడలు కదలడం వల్ల గులిమి చెవి రంధ్రం నుంచి బయటకు వస్తుంది. గులిమి ఎక్కువైతే వినికిడి సమస్యలతో పాటు చెవినొప్పి వస్తుంది. గోరువెచ్చని నీటిలో బేకింగ్ పౌడర్ వేసి ఆ మిశ్రమంతో చెవులను శుభ్రం చేయడం ద్వారా చెవులలోని గులిమిని తొలగించుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమం సహాయంతో కూడా చెవులను క్లీన్ చేయవచ్చు.
బేకింగ్ సోడాకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి నూన్ లేదా ఆలివ్ ఆయిల్ వాడటం ద్వారా చెవులను శుభ్రం చేసుకోవచ్చు. మైక్రోసక్షన్ పద్ధతి సహాయంతో డాక్టర్లను సంప్రదించి చెవులను శుభ్రం చేసుకోవచ్చు. గులిమి సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్లకు ఈ పద్ధతి మంచిదని చెప్పవచ్చు.
Also Read: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు గోంగూర తింటే ఏమవుతుందో మీకు తెలుసా?