Guava Fruit Benefits: జామ పండులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. అలాగే జామ ఆకులో కూడా మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులతో పాటు జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే జామ పండు ఎక్కువగా తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ జామ పండు తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం.
జామ పండు తింటే.. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలి పట్టినా ఈ సమస్యలు తగ్గుతాయి. అలాగే మూడు లేదా నాలుగు జామ ఆకుల్ని నీటిలో వేసి మరిగించి చల్లారాక ఆ నీటిని తాగడం వల్ల జలుబు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల నడుము నొప్పి కూడా బాగా తగ్గుతుంది.
Also Read: పూర్వం బట్టలను సబ్బులు లేకుండా ఎలా ఉతికేవారో మీకు తెలుసా?
మనం తరచుగా జామ ఆకు కషాయాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జామ ఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ తీరుని మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలస్ట్రాల్ని తగ్గించి, శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అందువల్ల గుండె సంబందిత సమస్యలు రాకుండా ఉంటాయి.
Also Read: మగవాళ్లు వెళ్లకూడని ఈ ఆలయాల గురించి తెలుసా..?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Want to get healthier at a lower cost so eat this fruit
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com