Healthy Life Tips: కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇదే సమయంలో కొన్ని సౌకర్యాలు కూర్చున్న చోటుకే వస్తున్నాయి. ఫలితంగా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా పనులు సాగిపోతున్నాయి. అయితే ఒక రకంగా ఇది బాగానే ఉన్నా.. ఆరోగ్యపరంగా మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకచోట కూర్చుని పనిచేయడం.. రాత్రిళ్ళు ఎక్కువగా విధులు నిర్వహించడం.. పని గంటలు ఎక్కువగా ఉండడం వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అలాగే వాతావరణం లో కాలుష్యం ఏర్పడడంతో పాటు ఆహార పదార్థాల నాణ్యత లోపించడంతో మనుషుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే కొన్ని రకాల రోగాలను దరి చేరకుండా చేయవచ్చు. మరి ఆ సూత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
నేటి కాలంలో చాలామందికి ఆల్కహాల్ అలవాటు తప్పనిసరిగా ఉంది. కొందరు వీకెండ్ లో.. మరికొందరు వీక్ లో రెండు లేదా మూడు సార్లు తీసుకుంటుండగా.. ఇంకొందరు మాత్రం ప్రతిరోజు తప్పనిసరిగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఇలా ఎప్పటికీ మద్యం తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ కిడ్నీలో పాడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొందరికి అధిక చెమట ద్వారా శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. ఇలాంటివారు తప్పనిసరిగా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు క్రమ పద్ధతిలో వాటర్ తీసుకోవడం వల్ల కిడ్నీలను కాపాడుకోవచ్చు.
ఇంట్లో వండిన ఆహారం కంటే బయట ఆహారం తినేవారి సంఖ్య ఎక్కువగా మారింది. అయితే బయట రెడీ చేసే ఆహారంలో సాల్ట్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. క్రమంగా ఇది గుండెపై ప్రభావం చూపుతుంది. అయితే గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇలాంటివారు బయట ఆహారం తినకుండా ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారంలో చాలావరకు ఉప్పు తగ్గించడం చాలా మేలు.
కొన్ని రకాల ఒత్తిడీలు. మానసిక ఉల్లాసం కోసం కొందరు ధూమపానానికి అలవాటు అవుతుంటారు. అయితే ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. దీర్ఘకాలికంగా మాత్రం ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది.. అందువల్ల సాధ్యమైనంత వరకు ధూమపానం కు దూరంగా ఉండటమే మంచిది. దీనివల్ల ఊపిరితిత్తులను కాపాడుకున్న వారవుతారు.
మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా చాలా అవసరం. అందువల్ల ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోయే ప్రయత్నం చేయాలి. సరైన నిద్ర వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా రాత్రులు ఎక్కువ సేపు మొబైల్ చూడకుండా ఏం టైంలోనే నిద్రపోయి.. సరైన సమయంలో నిద్ర లేవాలి.
వీకెండ్ లేదా ఏదైనా సందర్భంలో బయటకు వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు కనిపిస్తే నోరు ఊరుతుంది. ఇలాంటి వాటిలో ఐస్ క్రీం కూడా ఉంటాయి. ఐస్క్రీమ్ తినడం వల్ల తాత్కాలికంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఇది క్రమంగా కడుపులో సమస్యలను తీసుకువస్తుంది.