Vitamin Deficiency: విటమిన్ల లోపం ఉందా? ఈ 5 సంకేతాలతో గుర్తించండిలా

Vitamin Deficiency: మన శరీరానికి పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావడం సహజమే. మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అన్ని భాగాలకు అందితే అవి సక్రమంగా పనిచేస్తాయి. పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా అవయవాలు బలంగా ఉంటాయి. వాటి విధులు అవి నిర్వహించుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు రావు. వాటికి అందాల్సిన శక్తి అందకపోతే ఇబ్బందులు వస్తాయి. పోషకాహార లోపం వల్ల మనకు తిప్పలు ఏర్పడతాయి. తగిన స్థాయిలో విటమిన్లు లభించకపోతే కొన్ని […]

Written By: Srinivas, Updated On : March 25, 2023 1:01 pm
Follow us on

Vitamin Deficiency

Vitamin Deficiency: మన శరీరానికి పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావడం సహజమే. మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అన్ని భాగాలకు అందితే అవి సక్రమంగా పనిచేస్తాయి. పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా అవయవాలు బలంగా ఉంటాయి. వాటి విధులు అవి నిర్వహించుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు రావు. వాటికి అందాల్సిన శక్తి అందకపోతే ఇబ్బందులు వస్తాయి. పోషకాహార లోపం వల్ల మనకు తిప్పలు ఏర్పడతాయి. తగిన స్థాయిలో విటమిన్లు లభించకపోతే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. వాటిని దూరం చేసుకునేందుకు మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే.

శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడితే జుట్టు బలహీనంగా మారడం, గోర్లు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో మనం తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే దీని ప్రభావం మనకు కష్టాలు తెస్తుంది. ఇంకా నోటిలో పుండ్లు వస్తాయి. నోటిపూత అని చెప్పే ఈ రకమైన పగుళ్లు ఏర్పడతాయి. థయామిన్, రైబోఫ్లావిన్, పిరిడాక్సిన్, ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. కొన్ని సమయాల్లో నోటిపుండ్లు పెద్ద సమస్యకు దారి తీస్తాయి.

విటమిన్లు సరిగా ఉత్పత్తి కాకపోతే చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. ఇది చాలా మందిలో కనిపిస్తుంది. విటమిన్ లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. అందుకే విటమిన్ సి లోపం లేకుండా ఉండాలంటే తగిన ఆహారాలు తీసుకుంటే మంచిది. దీని లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దంతాల సమస్యలకు ఇదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. అందుకే విటమిన్ల లోపం లేకుండా పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకుంటే తక్షణమే పరిష్కారం లభిస్తుంది. దీనికి అందరు జాగ్రత్తలు తీసుకుని విటమిన్ల లోపం ఉండకుండా చూసుకుంటేనే లాభం ఉంటుంది.

Vitamin Deficiency

విటమిన్ ఎ తక్కువగా ఉంటే కంటిచూపు పై ప్రభావం పడుతుంది. రే చీకటి సమస్య రావడానికి కారణమవుతుంది. దీని నుంచి బయటపడటానికి ఆకుకూరలు రెగ్యులర్ గా తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. జింక్, నియాసిన్, రిబోఫ్లావిన్, పిరిడాక్సిన్ తక్కువగా తీసుకోవడం వల్ల తలపై పొలుసుల మచ్చలు ఏర్పడతాయి. కనుబొమ్మలు, చెవులు, కనురెప్పలు,చాతీపై పొలుసులు కనిపిస్తాయి. పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. దీంతో బలమైన ఆహారాలు తీసుకుని విటమిన్ల లోపం లేకుండా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.