Vastu Tips : వాస్తు టిప్స్ : వినాయకుడి స్వస్తిక్ గుర్తును ఎక్కడపెట్టాలి. దాని శక్తి ఏమిటో తెలుసా?

ఇలా స్వస్తిక్ కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. విష్ణుమూర్తి చేతిలో కూడా సుదర్శన చక్రం ఉన్నట్లే స్వస్తిక్ కు మంచి స్థానం ఉంటుంది. చెడును దూరం చేసి మంచిని మనకు అందించే అద్భుతమే స్వస్తిక్ అని చెప్పుకోవచ్చు.

Written By: Srinivas, Updated On : June 25, 2023 4:03 pm
Follow us on

Vastu Tips : మనం ఏ పూజ చేయాలన్నా మొదట పూజించేది వినాయకుడినే. అందరు దేవుళ్లకంటే ముందు వేడుకునేది విఘ్నేశ్వరుడినే. వినాయకుడి కంటే ముందు ఆయన చిహ్నం స్వస్తిక్ ను వేస్తారు. మనం ఏ పూజ చేయాలన్నా, హోమం నిర్వహించాలన్నా మొదట వేసేది స్వస్తిక్ గుర్తే. దానికి ఉన్న మహత్తర శక్తి తెలుసు కాబట్టే దాన్ని ముందు వేసుకుంటాం. స్వస్తిక్ గుర్తు వేసుకుని పూజ మొదలుపెడతాం. దీంతో మనకు అన్ని విషయాల్లో కలిసొస్తుందని నమ్ముతాం. అందుకే స్వస్తిక్ గుర్తును అన్ని చోట్ల వేసుకుంటాం.

స్వస్తిక్ గుర్తు

స్వస్తిక్ గుర్తు దేనికి సంకేతం? దీన్ని ఎందుకు వేస్తారు? ఇందులో దాగున్న రహస్యమేమిటి? అనే విషయాలపై ఆలోచిస్తే మనకు చాలా నిగూర్థాలు కనిపిస్తాయి. ఏ కొత్తవస్తువు కొన్నా దానిపై స్వస్తిక్ గుర్తు వేస్తుంటాం. వినాయకుడి పూజ ఎంత ముఖ్యమో దాని ప్రారంభానికి ముందు స్వస్తిక్ చిహ్నం వేయడం తప్పనిసరి. శుభలేఖలు, వ్యాపార లావాదేవీల ఖాతా పుస్తకాలు, ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు వేస్తుంటాం.

కొత్త వాహనానికి..

వాహనం కొన్నా కూడా దానిపై స్వస్తిక్ గుర్తు వేసుకుంటాం. దీంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. స్వస్తిక్ గర్తులోని నాలుగు భుజాలు వినాయకుడి భుజాలుగా చెబుతారు. అందులోని నాలుగు చుక్కలు చుతుర్విద పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు గుర్తులు. రెండు వైపుల ఉండే రెండు రేఖలు వినాయకుడి ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధి. ముందున్న రేఖలు కుమారులు యోగ క్షేమాలు తెచ్చిపెడతాయి. స్వస్తిక్ గుర్తు వినాయకుడి ప్రతిరూపంగా చెబుతారు. ఈ చిహ్నాన్ని వేసుకుని పనులు మొదలు పెడితే అందులో ఆటంకాలు లేకుండా పోతాయి.

సంస్కృతంలో..

సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు మంచి, ఆస్తి కలగడం అని అర్థం వస్తుంది. స్వస్తిక్ లో దాగి ఉన్న అర్థం అదే. దీంతో ఓంకారం తరువాత స్వస్తిక్ కు అంత పవిత్రత కలిగిన చిహ్నంగా చెబుతారు. బౌద్ధులు, జైనులు కూడా స్వస్తిక్ నే తమ పవిత్రమైనదిగా భావిస్తారు. స్వస్తిక్ ఇతర దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో కూడా స్వస్తిక్ ను శుభానికి, అదృష్టానికి సంకేతంగా చెబుతారు. ఇలా స్వస్తిక్ కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. విష్ణుమూర్తి చేతిలో కూడా సుదర్శన చక్రం ఉన్నట్లే స్వస్తిక్ కు మంచి స్థానం ఉంటుంది. చెడును దూరం చేసి మంచిని మనకు అందించే అద్భుతమే స్వస్తిక్ అని చెప్పుకోవచ్చు.