Vastu Tips : వాస్తు టిప్స్ : వాస్తు దోషాలను దూరం చేసుకోకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా?

Vastu Tips : ఇంటికి వాస్తు ఎంతో ముఖ్యం. వాస్తు లేనిదే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడరు. వాస్తు మన జీవితంతో అంతలా ముడిపడి ఉంది. దీంతో కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా వాస్తు చూసుకోవాల్సిందే. వాస్తు ప్రకారం లేకపోతే మనకు ఇబ్బందులు తప్పవు. ఇంట్లో అందరికి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. తరచూ గొడవలు వేధిస్తాయి. దీంతో ఇంటికి వాస్తు లోపం ఉందని గ్రహించుకోవాలి. నెగెటివ్ ఎనర్జీ ఉంటే ప్రశాంతత లోపిస్తుంది. వాస్తు దోషాలు లేకుండా చేసుకుంటేనే మనకు కష్టాలు […]

Written By: Srinivas, Updated On : February 5, 2023 8:51 pm
Follow us on

Vastu Tips : ఇంటికి వాస్తు ఎంతో ముఖ్యం. వాస్తు లేనిదే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడరు. వాస్తు మన జీవితంతో అంతలా ముడిపడి ఉంది. దీంతో కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా వాస్తు చూసుకోవాల్సిందే. వాస్తు ప్రకారం లేకపోతే మనకు ఇబ్బందులు తప్పవు. ఇంట్లో అందరికి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. తరచూ గొడవలు వేధిస్తాయి. దీంతో ఇంటికి వాస్తు లోపం ఉందని గ్రహించుకోవాలి. నెగెటివ్ ఎనర్జీ ఉంటే ప్రశాంతత లోపిస్తుంది. వాస్తు దోషాలు లేకుండా చేసుకుంటేనే మనకు కష్టాలు తొలగిపోతాయి. లేదంటే అవి మన వెంటే ఉంటాయి. నిత్యం తగాదాలతో కాలం గడపాల్సి ఉంటుంది. దీనికి నివారణోపాయం వాస్తు దోషాలను సరిచేసుకోవడమే.

వాస్తు దోషం ఉందని తెలుసుకోవడం ఎలా?

ఇంటికి వాస్తు దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి. ఇంటి బయట ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండి ఇంట్లోకి రాగానే చిరాకు, గొడవలు జరుగుతున్నాయంటే అది వాస్తు దోషమని గ్రహించుకోవాలి. ఇంట్లో బృహస్పతి బలహీనంగా ఉంటే సానుకూల వాతావరణం ఉండదు. ప్రతికూల వాతావరణంతో మనకు నిత్యం ఇబ్బందులు తప్పవు. చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటించి మనం పెద్ద సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు. ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉన్నట్లయితే పూజ గదిలో కచ్చితంగా ఉదయం, సాయంత్రం దీపం పెట్టి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ దూరం కావాలంటే అగరువత్తులతో ధూపం వేయడం మంచిది.

నెగెటివ్ ఎనర్జీని ఎలా దూరం చేసుకోవాలి?

ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలంటే గాయత్రి మంత్రం చక్కని పరిష్కారం చూపిస్తుంది. సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. ఇంట్లోని వారికి అనారోగ్యాలతో బాధపడుతుంటారు. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ఎక్కువ ఆదాయం మందులకే ఖర్చవుతుంది. తరచూ రోగాల బారిన పడుతుంటే వారి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడని తెలుసుకోవాలి. దీనికి కూడా పరిహారం ఉంది. ప్రతి ోజు గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తూ రెండు పూటలు వండిన ఆహారాన్ని భగవంతుడికి నివేదిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

కుజ దోష నివారణకు ఏం చేయాలి?

ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటే, కుటుంబ సభ్యుల్లో విభేదాలు పొడచూపుతుంటే కుజుడి స్థానం బాగా లేదని తెలుసుకోవాలి. కుజ ప్రభావం నుంచి బయట పడటానికి మార్గాలు అన్వేషించుకోవాలి. ఇంట్లో గాలి, వెలుతురు సరిగా లేకపోతే కుజ దోషం పట్టుకుంటుంది. అందుకే ఇంట్లోకి సూర్యకాంతి బాగా వచ్చేలా చూసుకుని పరిహారాలు పాటించాలి. రోజుకు రెండు సార్లు ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గి ఉఫశమనం లభిస్తుంది. ఇంట్లో ఎరుపు రంగు వస్తువులను ఉపయోగిస్తే కూడా కుజ దోష నివారణ జరుగుతుంది.

రాహువు ప్రభావం ఉందని తెలుసుకోవడమెలా?

ఇంట్లో ఎలక్ర్టానిక్ వస్తువులు పగిలిపోతున్నా బల్బులు, ట్యూబ్ లైట్లు కాలిపోతున్నా రాహువు ప్రభావం ఉందని గ్రహించుకోవాలి. రాహువు అశుభాలను కలిగిస్తాడు. దీంతో ఇంట్లో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. రాహువు దోష నివారణకు ఇంట్లో ఎరుపు రంగు స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. దీంతో బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో చెత్తచెదారం నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇల్లు అపరిశుభరంగా ఉంటే కూడా రాహువు దోషం ప్రభావం చూపుతుంది. దీంతో నిత్యం కలహాలు పలకరిస్తాయి.

వాస్తు దోష నివారణకు ఏం చేయాలి?

ఇంటికి పట్టిన వాస్తు దోషాలను నివారించుకోవాలి. చిన్ని చిన్న పరిహారాలు పాటించి ఇంటికి ఉన్న వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిష్ణాతులైన వారిని సంప్రదించి ఇంట్లో ఉన్న ప్రతికూల ప్రభావాలను తొలగించుకుంటే ప్రయోజనం కలుగుతుంది. వాస్తు దోషాలు లేకుండా చేసుకోకుండా అలాగే ఉంచుకుంటే వాటితో మన జీవితమే మారిపోతుంది. దుర్భరంగా మారి చివరకు కష్టాలు బాధిస్తాయి. అందుకే వాస్తు దోషాలను సరైన సమయంలో దూరం చేసుకుంటే మంచిది.