Matsya Yantra: ప్రస్తుత కాలంలో పద్ధతులకు చాలా విలువ ఇస్తున్నారు. ఇల్లు కట్టుకునే సమయంలో వాస్తును ప్రధానంగా చూసుకుంటున్నారు. ఇల్లు ఎలా ఉండాలి. ఏ దిక్కు ప్రధాన ద్వారం ఉంటే మంచిది అనే విషయాలు తెలుసుకుని మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా ఎవరో ఒకరు చెప్పింది కాకుండా పలువురిని అడిగితే మనిషికో రకంగా చెబుతూ తప్పుదోవ పట్టించడం ఖాయం. అందుకే పండితుడైన వాడిని ఒక్కడితోనే వాస్తు చూపించుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ఇల్లు కట్టుకునే సందర్భంలో వాస్తు శాస్త్రం ప్రకారం లేకపోతే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే అందరు ముందే వాస్తు చూసుకుంటున్నారు. దాని ప్రకారమే ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు.
ఇల్లు ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మనం ఇల్లు కట్టుకునే సమయంలో ఆరు ఫీట్లు మట్టి తీసి దాని స్థానంలో కొత్త మట్టిని పోస్తే ప్రయోజనం ఉంటుంది. పాత మట్టిని వాడుకోరాదు. అలా చేసినట్లయితే అందులో ఏం ఉన్నాయో మనకు తెలియకుండా పోతుంది. అంతకుముందు అక్కడ పొలం ఉందో, శ్మశానం ఉందో, బొక్కలు, వెంట్రుకలు వంటివి ఉంటే మనకు వాస్తు దోషం పడుతుంది. అందుకే పాత మట్టిని తీసివేసి కొత్త మట్టితోనే ఇల్లు కట్టుకోవడం శ్రేయస్కరం. దీనికి డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు. కానీ నూరేళ్లు ఉండే ఇల్లు కట్టుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు రావడం జరుగుతుందని తెలుసుకోవాలి.
ఇక ప్రతి ఇంట్లో మత్స్య యంత్రం ఉండాల్సిందే. ఈశాన్య మూల గోడలో దాన్ని లోపల పెడతారు. ఇది వేద కాలం నాటి నుంచి వస్తున్న ఆచారం. ఇది పెట్టకపోతే మనకు శుభాలు కలగవు. వాస్తు దోషం ఉన్నా దీంతో పోతుంది. అందుకే ప్రతి వారు గృహ ప్రవేశం సమయంలో మత్స్య యంత్రాన్ని పెట్టుకుంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారంగా దీన్ని చెబుతారు. అందుకే దీనికి అంతటి ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ప్రతి ఇంట్లో మత్స్య యంత్రం పెట్టుకుని తీరాల్సిందే. లేకపోతే కష్టాలు కొనితెచ్చుకోవడం ఖాయం.
మత్స్య యంత్రం అమర్చుకోవడం వల్ల వీధిపోటు దోషం పోతోంది. దుష్ట శక్తుల నుంచి ఇంటిని కాపాడుతుంది. అంతేకాదు శక్తివంతమైన ఫలితాలు ఇస్తుంది. అత్యంత శుభప్రదమైన పనులు జరిగేందుకు కారణమవుతుంది. మత్స్య యంత్రంతో ఎన్నో లాభాలు మనకు కనిపిస్తాయి. అందుకే ప్రతి ఇంటిలో మత్స్య యంత్రం ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మత్స్య యంత్రంతో సమస్త దోషాలు పటాపంచలైపోతాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి వారు మత్స్య యంత్రాన్ని ఇంటిలో అమర్చుకుని మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం.