https://oktelugu.com/

Paste : పేస్టును ఎక్కువగా వాడేస్తున్నారా? లేదంటే తినేస్తున్నారా? అయితే ఇటు ఓ లుక్ వేయండి..

నోటి సంరక్షణ, పరిశుభ్రత ఎప్పుడు బాగుండాలి. దీని వల్ల నోరు మాత్రమే కాదు మన మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే రోజుకు రెండు సార్లు అంటే ఉదయం, రాత్రిపూట ఖచ్చితంగా పళ్లను తోముకోవాలి. ఈ అలవాటు వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల పళ్లు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో మీ శరీరంలో చాలా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 12:14 pm
    Using too much paste? Or are you eating? But take a look..

    Using too much paste? Or are you eating? But take a look..

    Follow us on

    Paste : రాత్రిపూట నోట్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీన్ని కూడా బయటకు పంపవచ్చు. అయితే కొంతమంది టూత్ పేస్టును కాస్తనే పెట్టుకుంటారు. కానీ మరి కొంతమంది మాత్రం టూత్ పేస్ట్ ను మరీ ఎక్కువగా పెట్టుకుని దంతాలను క్లీన్ చేసుకుంటారు. ఎక్కువ టూత్ పేస్ట్ ను పెడితే పళ్లు బాగా క్లీన్ అవుతాయి అని నమ్ముతుంటారు. కానీ ఇలా మోతాదుకు మించి టూత్ పేస్ట్ ను పెట్టుకుంటే మాత్రం ఎక్కువ నష్టాలే ఉంటాయట. మరి ఎందుకు అని వివరాలు చూసేద్దాం.

    మరీ ఎక్కువ టూత్ పేస్ట్ తో పళ్లను తోమకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బఠానీ గింజ సైజు టూత్ పేస్ట్ తో పళ్లను తోముకోవాలి. ఈ కాస్త పేస్ట్ తో నే మొత్తం పళ్లు క్లీన్ అవుతాయట. ఇదిలా ఉంటే పిల్లలు బ్రష్ చేసేటప్పుడు కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలకు చాలా తక్కువ మొత్తంలో టూత్ పేస్ట్ ను ఇవ్వాలి. అది ఏ టూత్ పేస్ట్ అయినా సరే అతిగా ఇవ్వడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ టూత్ పేస్ట్ ను ఎక్కువగా వాడటం వల్ల పళ్లు, చిగుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

    టూత్ పేస్ట్ ను మరీ ఎక్కువగా వాడితే దంతాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. పళ్లను బలంగా చేయడానికి ఉపయోగించే టూత్ పేస్ట్ లో సోడియం ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల పళ్లలో గుంతలు ఏర్పడుతుంటాయి. అలాగే పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే పళ్లను తోమడానికి తక్కువ టూత్ పేస్ట్ ను ఉపయోగించవద్దు.

    చాలా మంది మౌత్ వాష్ ను కూడా కామన్ గా ఉపయోగిస్తున్నారు. మీకు ఏవైనా నోటి సంబంధ సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించడం మంచిది. మీ నోరు ఆరోగ్యంగా ఉంటే మీరు బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ ను ఉపయోగించడం మంచిది. ఇది నోటిని తాజాగా ఉంచడంలో సహాయ పడుతుంది. అలాగే నోట్లో దుర్వాసన రానివ్వదు. అంతేకాదు నోట్లో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. కానీ ఏ మౌత్ వాష్ మంచిదో దాన్ని మాత్రమే వినియోగించడం అవసరం.