Tablets
Tablets: ఇటీవల కాలంలో మందుల వాడకం పెరుగుతోంది. చీటికి మాటికి మాత్రలు వాడుతున్నారు. జలుబు చేసినా గోలీలు వేసుకుంటున్నారు. ఫలితంగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మందులతో శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ వాడకం వల్ల శరీరం శుష్కించిపోతుంది. మందుల వాడకం వల్ల ప్రమాదమే అని చెప్పినా వినడం లేదు. తీవ్రమైన నొప్పి వస్తే తప్ప గోలీలు వేసుకోకూడదు. ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మాత్రల వినియోగంలో పొరపాట్లు చేస్తున్నారు.
Also Read: Rashmi Gautam: ఆధారాలతో రష్మీ బాగోతం బయటపెట్టిన నెటిజన్… తప్పు చేశానని ఒప్పేసుకున్న స్టార్ యాంకర్!
ఆర్ఎంపీలు ఏవో మాత్రలు ఇస్తుంటే వాటిని వేసుకుంటూ కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యాంటీ బయోటెక్స్ వాడుతూ ఇతర జబ్బులు రావడానికి కారకులవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్లతో 5-7రోజుల్లో తగ్గిపోయే వాటికి కూడా యాంటీ బయోటెక్స్ మందులు ఇవ్వడంతో లేనిపోని తిప్పలు పడుతున్నారు. అనవసరంగా వాటిని తీసుకుని రోగనిరోధక శక్తి తగ్గిపోయేందుకు కారకులవుతున్నారు. దీనిపై వైద్యులు హెచ్చరికలు చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారు.
Tablets
దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, వికారం, గొంతునొప్పి, డయేరియా వంటి వాటిని యాంటీ బయోటెక్స్ వాడొద్దని ఐఎంఏ సూచించింది. ఈ మందుల వినియోగం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో మందుల వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని తూచ తప్పకుండా పాటించాని చెప్పింది. మందుల వాడకం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లేకపోతే జబ్బుల ముప్పు ఏర్పడి మనకు ఇబ్బందులే వస్తాయి.
మందులను ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు వేసుకోకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తీసుకోవాలి. లేదంటే అనేక కష్టాలు ఏర్పడే అవకాశాలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే తిప్పలు తప్పవని తెలుసుకోవాలి. ప్రతి చిన్న జబ్బుకు మాత్రలు శరీరానికి అలవాటు చేస్తే భవిష్యత్ లో ఆటంకాలు వస్తాయి. మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంటుంది. ఈ నేపథ్యంలో మాత్రలు వేసుకునే విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: Kodali Nani Arrested : బ్రేకింగ్ : మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్..? కారణం అదేనా!