Bad Luck: ఇరుగు పొరుగు అన్నాక పప్పూ బెల్లాలు ఇచ్చిపుచ్చుకోవడం కామన్. ఇక ఆఫీసులు, పనుల వద్ద కూడా తమ తోటి వారికి ఆర్థికంగా.. వారి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తారు. తమ దగ్గర లేనిది ఎదుటివారి దగ్గర ఉంటే అడిగి తీసుకోవడం చాలా కామన్ గా మన సమాజంలో జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇలా ఇతరుల నుంచి వస్తువులు తీసుకునే వారి జాబితాలో మీరుంటే వెంటనే ఆ అలవాటును మార్చుకోండి.. ఎందుకంటే అది మిమ్మల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇతరులను ఏదైనా అడిగి వస్తువు తీసుకుంటే వాటిలోని ప్రతికూల శక్తి మీ లోపలికి చొరబడుతుంది. ఎవరి నుంచైనా ఏదైనా తీసుకుంటే తొలుత తాత్కాలిక ప్రయోజనం దక్కుతుంది. కానీ కొంతకాలం గడిచాక మీరు అనేక రకాల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎవ్వరి నుంచి ఎప్పుడూ తాత్కాలికంగానైనా తీసుకోకూడదని వస్తువుల గురించి తెలుసుకుందాం..
Also Read: BJP : టీఆర్ఎస్ దాష్టీకాలపై బీజేపీ సమరశంఖం
వాస్తు ప్రకారం.. ఎవరి నుంచి వాచ్ తీసుకొని ధరించవద్దు. మనిషి జీవితం నడిచేదే కాలంతో.. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి ధరించిన వాచ్ మరొకరు ధరించవద్దు. ఒక వ్యక్తి చెడు ప్రభావాన్ని కలిగి ఉంటే.. మీరు అతడి గడియారాన్ని ధరిస్తే ఆ చెడు సమయం మీ జీవితంలోకి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఒకరి దుస్తులు ఇతరులు ఎప్పుడూ ధరించకూడదు. ఒకరు వేసుకున్న దుస్తుల్లోని నెగెటివ్ ఎనర్జీతోపాటు ఆ వ్యక్తి శరీరంలో ఉండే బ్యాక్టీరియాను కూడా తీసుకుంటారు. తద్వారా నష్టాల పాలవుతారు.
ఇక చెప్పులు, బూట్లు మొదలైనవి ఇతరులవి ధరించవద్దు. అలా చేస్తే మీ ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. ఎందుకంటే శని స్థానం పాదాలలో ఉందని భావిస్తారు.
ఇక ఎవరి నుంచి కూడా పెన్ను తీసుకోకూడదు. దీని వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు. వాస్తు ప్రకారం.. ఒకరు ధరించిన రింగ్ మరొకరు ధరించకూడదు. ఇది వ్యక్తి ఆరోగ్యం, జీవితం, మరియు ఆర్థిక స్థితి మారుతుంది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాచ్, దుస్తులు, చెప్పులు, బూట్లు, పెన్, రింగ్ లాంటివి ఇతరులవి అస్సలు తీసుకోకూడదు.
Also Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు
Recommended Videos