Electricity Bill: ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఫలితంగా ఎండ వేడి పెరిగిపోతోంది. జనం అల్లాడుతున్నారు. రోడ్ల మీదకు రావడానికి జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో రోజురోజుకు వేడి ప్రభావం ఎక్కువవుతోంది. ఫలితంగా నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు దీంతో కరెంటు బిల్లు కూడా అమాంతం పెరుగుతోంది. దీనిపై కూడా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే విద్యుత్ చార్జీలు సైతం పెరగడంతో ఈ నెల బిల్లు వాసిపోతోందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని కూడా అదుపు చేయాల్సి న పరిస్థితి. లేదంటే ఇంటి బడ్జెట్ మోత మోగుతుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో కుదేలవుతున్నారు. పెట్రో ధరల భారంతో ఇంటి ఖర్చులు ఎక్కువవుతున్నాయి. వేతనాలు మాత్రం పెరగం లేదు. కానీ అన్ని పెరుగుతుండటంతో ఇక ఏం చేసేదని మథనపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరెంటు బిల్లుల భయం తగ్గిపోతోందని తెలుస్తోంది. దీనికి గాను చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
Also Read: Prashant kishor- YCP: పీకే సేవలు వైసీపీకి అక్కర్లేదా? ఈ వ్యూహం వెనుక మర్మమేమిటి?
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మనం వినియోగించేవి మూడే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు. వీటిని ఉపయోగించే క్రమంలో మనం కొన్ని చిట్కాలు ప్రయోగించాలి. అప్పుడు మనకు కరెంటు బిల్లు ఎక్కువగా రాకుండా ఉంటుంది. దీంతో మనం సేఫ్ గా ఉంటాం. దీని కోసం ఫ్యాన్లు వాడితే వాటిని తరచూ వాటి విఢిభాగాలను మార్చుతుండాలి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తూ ఉండాలి. రెగ్యులేటర్ ఉండేలా చూసుకోవాలి. కండెన్సర్ కానీ బేరింగ్ కానీ పోతే వెంటనే అమర్చుకోవాలి. గ్రేసింగ్ కూడా ముఖ్యమే. తరచూ ఆయిల్ గ్రేసింగ్ చేస్తుండాలి. అప్పుడే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండదు.
ఏసీ వేసినా ఫ్యాన్ మాత్రం ఆఫ్ చేయొద్దు. అప్పుడే త్వరగా గది చల్లగా అవుతుంది. నార్మల్ స్పీడులో ఫ్యాన్ నడుస్తూనే ఉండాలి. ఏసీలు కూడా ఎక్కువగా కాకుండా నార్మల్ గా ఉంచుకుంటే చల్లగా ఉంటుంది. ఏసీ వేసినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. అప్పుడే గది చల్లగా ఉంటుంది. ఇంకా ఏసీని కూడా నిరంతరం సర్వీస్ చేస్తుండాలి. అప్పుడే విద్యుత్ వినియోగం ఎక్కువగా తీసుకోదు. అందుకే కరెంటును ఆదా చేయాలంటే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవాలి.
మండుతున్న ఎండలతో పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వేడిని తట్టుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా తాపం మాత్రం తగ్గడం లేదు. దీంతో జనం నిరంతరం చల్లగా ఉండే వాటి కోసమే తాపత్రయపడుతున్నారు. ఫ్రిజ్ లో ఉండే నీటిని తాగుతూ సేద తీరాలని చూస్తుంటారు. కానీ కుండలో నీరే సురక్షితం అని తెలుసుకోవాలి. ఇలా విద్యుత్ ను ఆదా చేసేందుకు ప్రజలు నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటూ పోతే ఫలితం మాత్రం ఉంటుందని గ్రహించుకోవాలి.
Also Read:Pawan Kalyan: ఏపీ వైద్య దుస్థితిపై పవన్ ఆవేదన, ఆగ్రహం