https://oktelugu.com/

Hair Health: నాచురల్ గా తెల్ల జుట్టును నల్లగా మార్చే డై ఇది..

ముందుగా ఓ గ్లాసు నీరు తీసుకుని దానిలో టీ పౌడర్ వేయాలి. టీ కోసం డికాషన్ చేసినట్టుగా చేసుకోవాలి. దీనిని ఓ ఇనుప కడాయిలో వడపోసుకొని ఇందులోనే మెంతిపొడి, ఉసిరిపొడి కలపుకోవాలి. రాత్రంత్రా దీనిని అలానే వదిలేయాలి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 6, 2024 3:28 pm
    Healthy Hair Tips

    Healthy Hair Tips

    Follow us on

    Hair Health: ప్రస్తుతం చాలా మందికి వెంట్రుకల సమస్యలు వేధిస్తున్నాయి. జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం, తెల్లగా మారడం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇక తెల్ల జుట్టు కోసం హెయిర్ డై చాలా మంది కామన్ గా వేసుకుంటున్నారు. దీని వల్ల తెల్ల జుట్టు నల్లగా కనిపిస్తుందని ఎక్కువ వినియోగిస్తున్నారు. అయితే, మార్కెట్లో దొరికే డై రిజల్ట్స్ చూపించినప్పటికీ, ఆ తర్వాత వీటి వల్ల నష్టాలే ఎక్కువ వస్తుంటాయి. అలా కాకుండా ఉండాలంటే, ఇంట్లోనే నేచురల్‌గా మనమే హెయిర్ డై తయారు చేసుకునే సౌకర్యం ఉంది. ఇంతకీ ఎలా ఎయిర్ డైని తయారుచేసుకోవచ్చో చూసేయండి.

    కావాల్సినవి:
    టీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మెంతిపొడి 1 టేబుల్ స్పూన్, ఉసిరిపొడి 2 టేబుల్ స్పూన్లు

    తయారీ విధానం:
    ముందుగా ఓ గ్లాసు నీరు తీసుకుని దానిలో టీ పౌడర్ వేయాలి. టీ కోసం డికాషన్ చేసినట్టుగా చేసుకోవాలి. దీనిని ఓ ఇనుప కడాయిలో వడపోసుకొని ఇందులోనే మెంతిపొడి, ఉసిరిపొడి కలపుకోవాలి. రాత్రంత్రా దీనిని అలానే వదిలేయాలి. ఆ మరుసటి రోజు ఉదయానికి నల్లగా డైలా మారుతుంది. సో దీన్ని మీరు తలకి అప్లై చేసుకోవాలి. అప్లే చేసిన 35 నుంచి 45 నిమిషాల పాటు అదే విధంగా ఉంచుకోవాలి.

    వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేస్తే మీ జుట్టు నల్లగా మారుతుంది. బ్లాక్ టీలో టానిక్ యాసిడ్ సహజంగానే జుట్టుని నల్లగా మారుస్తుంది. ఇది ఓ రకమైన పాలిఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇది సెల్ డ్యామేజింగ్ సమ్మేళనాలని బ్యాలెన్స్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది. ఇందులోని ఫ్లేవింగస్, థియారూబిన్స్ జుట్టుకి మంచి నలుపు రంగుని అందిస్తాయి. అంతేకాదు ఇది జుట్టుకి కెరాటిన్ బూస్ట్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పెరిగి అందంగా, నల్లగా కనిపిస్తుంటాయి.

    సాధారణంగా జుట్టు మెలనిన్ వల్ల తెల్లగా అవుతుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడాతాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టును కుదుళ్ల నుంచి బలంగా చేస్తుంది. మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించి ఫ్రీ రాడికల్ నష్టంతో పోరాడి తెల్లజుట్టుని నల్లగా మారుతుంది ఉసిరి.

    మెంతులు జుట్టును బలంగా చేస్తాయి. మెంతుల్లోని పొటాషియం కంటెంట్ జుట్టుని నల్లగా మార్చడంలో మీకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఇందులోని ఐరన్ జుట్టుకి బలం. స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచి.. జుట్టుని పెరిగేలా చేస్తుంది మెంతులు.

    అందంగా కనిపించాలని అందరికీ ఉన్నా.. కెమికల్స్ మాత్రమే వాడాలి అనుకుంటారు చాలా మంది. కానీ ఇవి మాత్రమే అవసరం లేదు. నేచురల్ ప్రాడక్టులు వాడినా సరే జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా జుట్టు అందంగా, పొడుగ్గా మార్చుకోవచ్చు. దీంతో పాటు హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అయితే ఇక రిజల్ట్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.