
దేశంలో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రధానంగా గుండెజబ్బుల బారిన పడటానికి కారణమవుతున్నాయి. అయితే వజ్రం సహాయంతో గుండెపోటుకు చెక్ పెట్టవచ్చని దేశంలోని వైద్యులు ప్రూవ్ చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సూరత్ కు చెందిన అతుల్ అభ్యాంకర్ వజ్రాలతో చికిత్స చేస్తూ మనిషి ప్రాణాలను నిలబెడుతున్నారు.
Also Read: గొప్ప మనస్సు చాటుకున్న భిక్షగాడు.. 600 మంది అనాథల కోసం..?
చాలామందికి రక్తనాళాల్లో క్యాల్షియం గడ్డల వల్ల గుండెపోటు వస్తుంది. అయితే ప్రముఖ కార్డియాలజిస్ట్ అతుల్ అభ్యాంకర్ చిన్న డ్రిల్ యంత్రానికి సూరత్ లో తయారయ్యే వజ్రాలను అమర్చి సమస్యకు చెక్ పెడుతున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడే వాళ్లు అతుల్ దగ్గర చికిత్స చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రోబోబ్లాటర్ అనే డ్రిల్ యంత్రం, వజ్రంతో అతుల్ చేస్తున్న వైద్యం మంచి ఫలితాలను ఇస్తోంది.
Also Read: రక్తంలో ఆ ఇన్ఫెక్షన్లు ఉన్నాయా… తీవ్రమైన కరోనా సోకే ఛాన్స్..?
అతుల్ వజ్రంతో చేస్తున్న ఈ చికిత్స గురించి చెబుతూ వజ్రం అన్నికంటే దృఢమైన రాయి అని.. వజ్రాన్ని ఉపయోగించడం వల్ల గుండెలో రాయిలా పేరుకుపోయిన క్యాల్షియం గడ్డలను సులభంగా తొలగించడం సాధ్యమవుతుందని చెప్పారు. రోబోబ్లాటర్ అనే చిన్న యంత్రం వేగంగా తిరుగుతూ కాల్షియం గడ్డలను తొలగించడంలో సహాయపడుతుందని అతుల్ తెలిపారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
రోబోబ్లాటర్, వజ్రం క్యాల్షియం గడ్డలను పొడిగా మారుస్తాయని.. ఆ పొడి రక్త ప్రవాహంలో కొట్టుకుపోతుందని అన్నారు. ఇతర దేశాల వైద్యులు సైతం ఈ విధానంలో చికిత్స చేయడానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం.