Hair Loss Solutions: మనిషి అందంగా కనిపించడానికి జుట్టు కూడా బాగుండాలి. కానీ వాతావరణ కాలుష్యం, ప్రోటీన్ల లోపం వల్ల కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. దీంతో వారు అనేక సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే జుట్టు పెరగడానికి ప్రత్యేకంగా రసాయనాలు వాడుతూ మెడిసిన్స్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని రకాల పదార్థాలతో రెసిపీ తయారు చేసుకొని తలకు పట్టించడం వల్ల జుట్టు పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. మరి జుట్టు పెరగడానికి ఉన్న బెస్ట్ 5 టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులో ఉండే సోన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీనికి నిమ్మకాయ రసం కలిపి వాడడం వల్ల మరింత ప్రయోజనం గా ఉంటుంది. నిమ్మరసంలో సి విటమిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. దీనికి కోడిగుడ్డు కలవడంతో మరింత మిశ్రమంగా మారి జుట్టు ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అలాగే వారానికి ఒకసారి క్యాస్టర్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు రక్తప్రసరణ జరుగుతుంది. ఫలితంగా నిత్యం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టులో డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిని తొలగించడానికి అనేక రసాయనాలు వాడుతూ ఉంటారు. వాటి స్థానంలో ఆనియన్ జ్యూస్ తయారుచేసుకొని వారానికి రెండుసార్ల మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టులో ఉండే దుమ్ము దూళి తొలగిపోవడంతో పాటు డాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది.
ఒక్కోసారి జుట్టు పొడిబారి ఉండడం వల్ల తలనొప్పి వస్తుంది. అయితే ఎప్పుడు పొడిబారి ఉండకుండా నిగనిగ లాడేలా ఉండాలంటే అలోవెరా జెల్ తో తేనె కలిపి వారానికి ఒకసారి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అలాగే నిగనిగనలాడుతూ అందంగా కనిపిస్తుంది. మెంతుల వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే జుట్టుకు కూడా ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మెంతుల గింజలను పేస్టులా తయారుచేసి కోకోనట్ ఆయిల్ తో కలిపి వారానికి ఒకసారి జుట్టుకు పట్టించాలి. మెంతుల్లో నికోటినిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది కొత్త జుట్టు రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల దీనిని వాడడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు కొత్త జుట్టు వస్తుంది.
ఇవే కాకుండా చుట్టూ ఆరోగ్యంగా ఉండడానికి ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు ఎక్కువగా నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక నిద్ర కరువైన కూడా జుట్టు పొడిబారిగా ఉంటుంది. మంచి నిద్ర తోపాటు సరైన ఆహారం తీసుకుంటూ నేచురల్ రెసిపీని తలకు పట్టించాలి. అలాకాకుండా రసాయనాలు వాడితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.