Top 10 Best Cities : భారత్ లో టాప్ 10 నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే ఉత్తమ నగరాలివీ

ఈ నగరాలు అద్భుతమైన సంగీతం, ఆహ్లాదకరమైన శక్తి , గొప్ప ఆహారం, పానీయాలు ఉన్న ప్రదేశం కోసం చూస్తున్నారా? పార్టీ పెట్టడానికి ఇక్కడ కారణం అవసరం లేదు. యాదృచ్ఛిక వినోద ప్రణాళికలు కూడా అందంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం..

Written By: NARESH, Updated On : July 5, 2023 9:33 pm
Follow us on

Top 10 Best Cities  : పొద్దంతా ఉరుకుల పరుగుల జీవితం.. సాయంత్రం, రాత్రి కాగానే సేద తీరుతాం.. నగరాలన్నీ సాయంత్రం పార్కులు, పబ్బులు, అమ్యూజ్ మెంట్ పార్కుల్లో జనాలతో నిండిపోతాయి..

ఈక్రమంలోనే భారత్ లో నైట్ లైఫ్ ను అమితంగా ఎంజాయ్ చేసే టాప్ 10 నగరాలున్నాయి.. అవేంటో తెలుసుకుందాం..

ఈ నగరాలు అద్భుతమైన సంగీతం, ఆహ్లాదకరమైన శక్తి , గొప్ప ఆహారం, పానీయాలు ఉన్న ప్రదేశం కోసం చూస్తున్నారా? పార్టీ పెట్టడానికి ఇక్కడ కారణం అవసరం లేదు. యాదృచ్ఛిక వినోద ప్రణాళికలు కూడా అందంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం..

1. ముంబై

దేశంలో 24 గంటలు మెలకువగా ఉండే సిటీ ముంబై. ఇదే మన దేశ వాణిజ్య రాజధాని. అందుకే టాప్ 1లో ఉంది.మెరైన్ డ్రైవ్ మరియు నారిమన్ పాయింట్ యొక్క బౌలేవార్డ్‌లు, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మీరు అన్వేషించగల ఆనందించగల ప్రదేశాలకు ఇక్కడ కొరత లేదు.

2.ఢిల్లీ


ముంబై తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ఉంటుంది. రాజధానిలో నైట్ లైఫ్ కొనసాగుతూనే ఉంటుంది. 24 గంటలూ ఇక్కడ అన్నీ దొరుకుతాయి

3. బెంగళూరు


ఐటీ సిటీ బెంగళూరు టాప్ 3లో ఉంటుంది. ఇక్కడ టెకీలతో పార్టీలకు ఫేమస్. ఎంజీ రోడ్ ఎంజాయ్ మెంట్ కు స్వర్గధామంగా పేర్కొంటారు.

4. గురుగ్రామ్


గురుగ్రామ్ నే మిలినీయం సిటీ అంటారు. ఇదో కార్పొరేట్ హబ్. బిజినెస్ మ్యాన్స్ , టెకీలు ఉండే ఏరియా.. డీఎల్ఎఫ్ సైబర్ సిటీ సహా ఎన్నో ప్రఖ్యాత కంపెనీలున్న ఈ నగరం కూడా నైట్ లైఫ్ ఎంజాయ్ కు ప్రతీతి

5.ఫుణే


ఫుణేలో కూడా 24 గంటలూ నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేలా వసతులు ఉన్నాయి. పూణేలో ఎప్పుడూ దేశం నలుమూలల నుండి కళాకారులచే అనేక ప్రత్యక్ష కచేరీలు.. ప్రదర్శనలను కూడా నిర్వహిస్తుంది,

6. గోవా


భారత్ లో అంతర్జాతీయ వసతులు, కల్చర్ ఉండే గోవాలోనూ 24 గంటలూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ అన్నింటికి స్వేచ్ఛ ఉంటుంది.

7.కోల్ కతా


తూర్పు తీర కోల్ కతా కూడా దేశంలోనే టాప్ 4 నగరాల్లో ఒకటి. ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి కొదవలేదు.

8. హైదరాబాద్


తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బేగంపేట, బంజారాహిల్స్, సోమాజిగూడ సహా పబ్బులు, చార్మినార్ వంటి ప్రదేశాలతో 24 గంటలూ నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంది..

9.చండీగఢ్


పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని కూడా 24 గంటల నైట్ లైఫ్ ఎంజాయ్ కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అన్ని వసతులు కేంద్రపాలిత ప్రాంతం కావడంతో స్వేచ్ఛ ఎక్కువ.

10.చెన్నై


దక్షిణాదిలో మరో పెద్ద నగరం చెన్నై. ఇండియాలోనే టాప్ 4 నగరాల్లో ఇదీ ఒకటి. పాషా, గాట్స్‌బై 2000 , లోయర్ డెక్ వంటి క్లబ్‌లు కొన్ని పానీయాలు , డ్యాన్స్ కోసం స్నేహితులతో హ్యాంగ్అవుట్ చేయడానికి కొన్ని గొప్ప ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. .