Tooth Brushing Cause Cancer: రోజంతా ఏవేవో ఆహారపదార్ధాలు తింటుంటాం. ఇంకా ఏవేవో ద్రావణాలు తాగుతూ ఉంటాం. అవన్నీ కూడా కడుపులోకి వెళ్లడానికి కీలక పాత్ర పోషించేది నోరు మాత్రమే. నోరు మాత్రమే ఈ పని చేయదు. ఆహారాన్ని దంతాలు నమలిన తర్వాత.. ఆహారం నాలుక భాగం ద్వారా లోపలికి వెళ్తుంది. ఇలా దంతాలు ఆహారాన్ని నమ్మిన సమయంలో కొంతలో కొంత భాగం ఇరుక్కుపోతాయి. వాటిని మరుసటి రోజు ఉదయం దంతావధానం ద్వారా శుభ్రం చేసుకోవాలి. తద్వారా నోటి నుంచి దుర్వాసన రాదు. నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఇతర చెడు పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.. నోరు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. నోటి నుంచి దుర్వాసన కనుక వస్తే అప్పుడు రకరకాల రోగాలు వస్తుంటాయి.
అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం రోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకోవాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక దంత వైద్యుడిని సందర్శించాలి. అంతేకాదు దంత సంరక్షణ సక్రమంగా ఉంటాయి తల, మెడ భాగంలో వచ్చే క్యాన్సర్లను తగ్గించవచ్చు.. దంత సంరక్షణ సక్రమంగా ఉంటే చిగుళ్ల వ్యాధి, తల, మెడ, ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణ వ్యవస్థ వంటి క్యాన్సర్లు దరి చేరవు.. దంత సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రత సక్రమంగా లేకపోవడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఆల్జీమర్స్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
నోటి సంరక్షణ సరిగా లేకపోతే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తుంటాయి. క్యాన్సర్ నివారణకు ఇచ్చే చికిత్స నోటి ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.. క్యాన్సర్ నివారణకు అందించే రేడియో ఆధారిత చికిత్స వల్ల చిగుళ్ల ఆరోగ్యం సరిగా లేని రోగులు ఆ తర్వాత అధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల రేడియో థెరపీ చికిత్సకు ముందు.. చికిత్స తర్వాత నోటి పరిశుభ్రతను సక్రమంగా పాటించాలి. అలా పాటించినప్పుడే రోగుల దంతాలు సక్రమంగా ఉంటాయి. ఒకవేళ దంతాలు సరిగా లేకపోతే.. శుభ్రతను సక్రమంగా పాటించకపోతే బ్రష్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అప్పటికే దంతాలు బలహీనమైపోతాయి. చిగుళ్ళు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ అధ్యానాన్ని దక్షిణాసియా దేశాలలో పలు ప్రాంతాలను సందర్శించి సేకరించారు.. ముఖ్యంగా చక్కెరతో తయారుచేసిన పదార్థాలను తినకపోవడం.. పొగాకు ఉత్పత్తులను వాడకపోవడం వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు అంటున్నారు..
Also Read: Liver Problem: ఈ లక్షణాలు ఉంటే ఫ్యాటీ లివర్ సమస్య మొదలైనట్లే…
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఆగ్నేయాసియా ప్రాంతాలలో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు వివరాలు సేకరించింది. ఇందులో భాగంగా నోటి సంరక్షణ గురించి అవగాహన కల్పించింది. చాలామందిలో నోటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించింది. వీరందరికీ కూడా పొగాకు ఉత్పత్తులను వాడటం.. ఇతర వ్యసనాలు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అందువల్లే నోటి సంరక్షణను సక్రమంగా పాటించాలని ఆ అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు సూచించారు. ” ప్రజలకు అవగాహన పెంచుకోవాలి. బ్రషింగ్ విధానాన్ని సక్రమంగా చేపట్టాలి.. క్యాన్సర్ నుంచి మొదలుపెడితే ఇతర తీవ్రమైన అనారోగ్యాలను నివారించడంలో బ్రషింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటప్పుడు నోటి సంరక్షణ అనేది సక్రమంగా ఉండాలి. ప్రాథమిక స్థాయిలోనే కాకుండా అన్ని స్థాయిలలో నోటి సంరక్షణ అనేది కీలకంగా ఉండాలని” ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో కావిటీస్ సమస్య అనేది అందరిలోనూ సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ సమస్యను చాలామంది తీవ్రంగా పరిగణించడం లేదు. దీనివల్ల ఆ సమస్య అంతకంతకు తీవ్రమవుతోంది. ఇది ఇతర వ్యాధులకు దారితీస్తోంది. అందువల్లే సాధ్యమైనంతవరకు దంతాల విషయంలో అనూహ్య మార్పులు కనిపించినప్పుడు.. నోటి నుంచి దుర్వాసన వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. నోటి సంరక్షణ సక్రమంగా ఉంటేనే మిగతా వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.. నోటి దుర్వాసన అనేది అత్యంత ప్రమాదకరమైనది. నోటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల నలుగురు మనతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు.
ఈ సమాచారం వివిధ అధ్యయనాలు, వేదికల ద్వారా సేకరించాం. ఇది పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఈ కథనం వైద్య చికిత్సకు ప్రత్యామ్నయం అసలు కాదు. ఈ విషయాన్ని పాఠకులు గమనించగలరు.