Salt:మనలో చాలామంది చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వస్తుందని భావిస్తారు. అయితే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తినేవాళ్లకు మధుమేహం ముప్పు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉప్పు ద్వారా లభించే సోడియం ఎక్కువగా తీసుకునే వాళ్లకు మధుమేహం ముప్పు ఎక్కువని తెలుస్తోంది.
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగితే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండే అవకాశాలు కూడా ఉండవని చెప్పవచ్చు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో 1500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సోడియం ఉండకుండా జాగ్రత్త పడాలి. చిరుతిళ్లు, పచ్చళ్లు తినడం ద్వారా కూడా శరీరంలో సోడియం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
తక్కువ ఉప్పుకు అలవాటు పడటం వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. భోజనం చేసే సమయంలో అధికంగా ఉప్పు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.