https://oktelugu.com/

cough, cold, fever: దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటిని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

cough, cold, fever: మనకు దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. వాతావరణం మారినప్పుడు కానీ ఇతర ప్రాంతాల్లో నీళ్లు తాగినప్పుడు కానీ మనకు దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి వేధిస్తాయి. వీటి బారిన పడగానే చాలా మంది మాత్రలు వేసుకుంటుంటారు. యాంటీ బాటిక్ మందులు వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంకా దుష్ర్రభావాలే ఎక్కువగా వస్తాయి. ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కని ఔషధం తయారు చేసుకోవచ్చు. కానీ ఆంగ్ల మందులు వాడటానికి ఎక్కువ మంది […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2023 / 03:56 PM IST
    Follow us on

    cough, cold, fever: మనకు దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. వాతావరణం మారినప్పుడు కానీ ఇతర ప్రాంతాల్లో నీళ్లు తాగినప్పుడు కానీ మనకు దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి వేధిస్తాయి. వీటి బారిన పడగానే చాలా మంది మాత్రలు వేసుకుంటుంటారు. యాంటీ బాటిక్ మందులు వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంకా దుష్ర్రభావాలే ఎక్కువగా వస్తాయి. ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కని ఔషధం తయారు చేసుకోవచ్చు. కానీ ఆంగ్ల మందులు వాడటానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. వీటి నివారణకు మనం తయారు చేసుకునే ఔషధం ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుంటే సరి.

    దగ్గు, జలుబు తగ్గించే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 6 ఎంఎల్ కొబ్బరి నూనె, 1 ఎంఎల్ పిప్పర్ మెంట్ నూనె, ఒక ఎంఎల్ లవంగం నూనె, ఒక ఎంఎల్ దాచ్చిన చెక్క, ఒక ఎంఎల్ యూకలిప్టస్ నూనె, ఒక గ్రాము పచ్చ కర్పూరం, ఒక గ్రాము వాము పువ్వును ఉపయోగించుకుని వాడుకోవాలి. దీన్ని లోపలికి తీసుకోకుండా చర్మంపై పూసుకుంటే సరిపోతుంది. ఈ ఏడు పదార్థాలతో తయారు చేసిన నూనెను అర టీ స్పూన్ తీసుకుని వేడి నీటిలో వేసి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆవిరి పట్టుకోవాలి.

    ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక వస్త్రానికి లేదా టిష్యూ పేపర్ కు ఈ నూనెను కొద్దిగా రాసి తరచూ వాసన చూస్తుంటే త్వరగా తగ్గుతుంది.వేడి నీటితో కాపడం
    ముక్కు దిబ్బడ, ముక్కు కారడం వంటి సమస్యలకు పైన తయారు చేసుకున్న ఔషధం గొంతు, చర్మంపై రాసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. తలపై రాసుకోవడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటివి మాయమవుతాయి. ఈ నూనెను వేడి నీటితో కాపడం పెట్టుకుంటే కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

    నూనెను వాడుతూ అల్లం ముక్కలను నోట్లో వేసుకుంటే గొంతు నొప్పి దూరం అవుతుంది. ఇంగ్లిష్ మందులు వాడకుండా మన ఇంట్లోనే తయారు చేసుకునే సహజమైన మందు వాడుకుని వాటి నుంచి లబ్ధిపొందొచ్చు.అన్నింటికి మందులు వాడొద్దు దగ్గు, జలుబు, జ్వరం సాధారణంగా వచ్చేవే. వీటికి కూడా మందులు వాడటం శ్రేయస్కరం కాదు.

    చిన్న చిన్న వాటికి కూడా మందులు వాడితే దుష్ఫరిణామాలు వస్తాయి. అందుకే టాబ్లెట్ల జోలికి వెళ్లకూడదు. అత్యవసరమైతే తప్ప ఇంగ్లిష్ మందులు వాడటం అంత మంచిది కాదు. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇష్టానుసారం మందులు వాడటం సరైంది కాదు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటివి వచ్చినా సహజంగా అవే పోతాయి. కానీ ఒకవేళ మందు వేసుకోవాలనుకుంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న ఔషధం వాడుకోవడం ఉత్తమం.