Summer Heat: దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. వేసవికాలంలో ఎండ వేడిమి నుంచి తట్టుకోవడంతో పాటు శరీరం చల్లబడాలంటే కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వేసవిలో చాలామంది వడదెబ్బతో బాధపడుతుంటారు. వేసవిలో ఉల్లిని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వేసవిలో కర్భూజా పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. కర్భూజా చెమట పట్టకుండా నివారించడంతో పాటు నీటి శాతంను ఎక్కువగా కలిసి ఉంటుంది. కొబ్బరి బోండాం శరీరంను చల్లదనంతో ఉండేలా చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది. వేసవిలో నిమ్మకాయను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతోంది. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
రోజులో ఎక్కువసార్లు మజ్జిగను తీసుకుంటే శరీరం కూల్ గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేసవిలో పుదీనా తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వేసవిలో శరీరానికి ముఖ్యమైన వాటిలో కీరదోస కూడా ఒకటి వేసవిలో పుచ్చకాయ తినడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. వేసవిలో శరీరంలో వేడిని తగ్గించే వాటిలో తాటి ముంజలు కూడా ఒకటి.
శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్, జింక్, కాపర్, మెగ్నిషియం, సెలీనియం శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేయడంలో తోడ్పడతాయి. వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.