Tips To Cure Constipation: ఆధునిక కాలంలో మలబద్ధకం సమస్య వేధిస్తోంది. చాలా మంది జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదు. ఫలితంగా ఏ వయసు వారినైనా మలబద్ధకం సమస్య వెంటాడుతోంది. సరైన సమయంలో సరైన విధంగా ఆహారం తీసుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రస్తుతం అందరు బేకరీ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు, ఫిజాలు, బర్గర్లు వంటివి తినడం వల్ల మన కడుపు కీకారణ్యంగా మారుతుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణం అయితేనే బయటకు పోతుంది. లేదంటే పేగుల్లోనే ఉంటే మనకు ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా డైట్ మెనూ పాటించాల్సిందే.

శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మనం మంచినీరు ఎక్కువగా తాగం. దీంతోనే కాన్ స్టిపేషన్ సమస్య ఏర్పడుతుంది. మనం తీసుకున్న పదార్థాలు అరగకపోతే మలబద్ధకం సమస్య వస్తుంది. దీంతో మనకు ఏమీ తోచదు. పుల్లటి తేన్పులు వస్తాయి. గుండెల్లో మంట పుడుతుంది. పొద్దంతా ఒళ్లంతా బద్ధకంగా ఉంటుంది. ఇన్ని సమస్యలకు మూలకారణం అవుతుంది. అందుకే మనం తినే పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యేవిగా ఉండాలి. లేకపోతే మలబద్ధకం సమస్య వేధించడం ఖాయం.
Also Read: Aging Problems: ఈ చిట్కాలు పాటిస్తే వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి తెలుసా?
చలికాలంలో పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పండ్ల రసాలు తాగాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నిరోధించడానికి ఫైబర్ ఉన్న ఆహారాలే మేలు చేస్తాయి. ప్రతి రోజు నీటిని కూడా ఎక్కువగా తాగాలి. రోజు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. కానీ ఈ కాలంలో తగినంత నీరు తాగేందుకు ఎవరు కూడా మొగ్గు చూపరు. దీంతోనే ఈ సమస్య జఠిలమవుతుంది. దృష్టంతా కడుపు మీదే ఉంటుంది.

మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే త్రిఫల చూర్ణం బాగా పనిచేస్తుంది. వాత, పిత్త, కఫాలను సమర్థంగా ఎదుర్కొంటుంది. పడుకునే ముందు రోజు ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం పౌడర్ ను నీళ్లలో కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఎండు ద్రాక్షలను నీళ్లలో నానబెట్టి గోరు వెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య రాదు. ఇందులో ఉండే ఫైబర్ తో మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. నల్లద్రాక్షతో మంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Vastu Tips: ఇంట్లో ఈ ఐదు ఉంటే అన్ని శుభాలే..
మలబద్ధకం సమస్యకు ఆముదం కూడా ఉపయోగపడుతుంది. ఇది మల, వ్యర్థాలను తొలగించడంలో సాయపడుతుంది. నిద్రపోయే ముందు ఒక టేబుల్ స్పూన్ ఆముదం తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. గర్భిణులు, రుతు క్రమం ఉన్న మహిళలు దీనికి దూరంగా ఉంటేనే మంచిది. ఇన్ని విధాలా చిట్కాలు ఉపయోగించి మలబద్ధకం సమస్యను దూరం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆశించడంలో తప్పులేదు.
[…] Also Read: Tips To Cure Constipation: మలబద్ధకం సమస్య పోవాలంటే ఈ చ… […]