https://oktelugu.com/

Suvival From Corona : కరోనా నుంచి కోలుకోవడానికి మూడేళ్లు.. ఈమె బతుకు పోరాటం కన్నీళ్లు తెప్పిస్తుంది

Suvival From Corona : కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత గడగడలాడించిందో తెలుసు. ఇది మనకో గుణపాఠం నేర్పింది. అజాగ్రత్తగా ఉంటే అంతేసంగతి. చాలా మంది ప్రాణాలు తోడేసింది. నాలుగు దశలు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. దీని వల్ల కరోనా అంటేనే అందరికి భయం పట్టుకునేది. ఈ క్రమంలో వైరస్ అందరిని పలక రించింది. తన ప్రతాపానికి బలి చేసింది. కరోనా ప్రభావానికి ఎంతో నష్టం సంభవించింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 9, 2023 8:23 am
    Follow us on

    Suvival From Corona : కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత గడగడలాడించిందో తెలుసు. ఇది మనకో గుణపాఠం నేర్పింది. అజాగ్రత్తగా ఉంటే అంతేసంగతి. చాలా మంది ప్రాణాలు తోడేసింది. నాలుగు దశలు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. దీని వల్ల కరోనా అంటేనే అందరికి భయం పట్టుకునేది. ఈ క్రమంలో వైరస్ అందరిని పలక రించింది. తన ప్రతాపానికి బలి చేసింది. కరోనా ప్రభావానికి ఎంతో నష్టం సంభవించింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇంతటి ఉత్పాతానికి కారణం కరోనా కావడం గమనార్హం.

    2020 డిసెంబర్ లో వెలుగులోకి వచ్చిన కరోనా రెండేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించింది. దీని బారిన పడిన వారికి వాసన, రుచి రాకుండా పోతాయి. ఈనేపథ్యంలో అమెరికాకు చెందిన 54 ఏళ్ల జెన్నిఫర్ హెండర్సన్ 2021 జనవరిలో కరోనా బారిన పడింది. అప్పటి నుంచి ఆమెకు వాసన, రుచి తెలియకుండా పోయాయి. ఇన్నాళ్లు ఆమె వాటి వాసన రుచి చూడలేదు. కరోనా మహమ్మారి ప్రభావానికి బలైన వారిలో ఈమె కూడా ఒకరు.

    మూడేళ్ల పాటు ఆమె కోలుకోలేదు. కరోనా ప్రభావంతోనే కాలం గడిపింది. ఇన్ని రోజులు పేసెంటుగానే ఉండిపోయింది. కరోనా వల్ల ఎంత మంది చనిపోయారు? ఎంత మంది బాధ పడ్డారు. ఎంతో మంది క్వారంటైన్ లో ఉండి రోగాన్ని నయం చేసుకున్నారు. కొందరు మాత్రం రోగం నుంచి కోలుకోక ప్రాణాలు వదిలారు. ఈ క్రమంలో కరోనా రక్కసికి బలైన వారు చాలా మంది ఉన్నారు. కరోనా నుంచి కోలుకోవడానికి ఆమెకు అంత సమయం పట్టడంతో ఆమె కథ ఎవరికైనా కన్నీళ్లు పెట్టిస్తోంది.

    మనదేశంలో కూడా చాలా మంది మూడు దశల్లో ప్రాణాలు కోల్పోయారు. చేయని తప్పుకు ఫలితం
    అనుభవించారు. కరోనా ధాటికి బలైపోయారు. ఇప్పుడు కరోనా మళ్లీ దాడి ప్రారంభిస్తోంది. రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మెల్లమెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువ కావడంతో అందరిలో భయం నెలకొంటోంది.