అలర్జీతో బాధ పడుతున్నారా.. ఆ కరోనా వ్యాక్సిన్లే తీసుకోవాలంట..!

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలు కాగా త్వరలో భారత్ లో కూడా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలు కానుంది. అయితే శాస్త్రవేత్తలు అలర్జీతో బాధ పడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదని చెబుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో అలర్జీ లక్షణాలు కనిపించాయి. Also Read: దేశమంతా కరోనా టీకా ఫ్రీ అయితే మసాచుసెట్స్ జనరల్ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 2, 2021 5:21 pm
Follow us on


ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలు కాగా త్వరలో భారత్ లో కూడా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలు కానుంది. అయితే శాస్త్రవేత్తలు అలర్జీతో బాధ పడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదని చెబుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో అలర్జీ లక్షణాలు కనిపించాయి.

Also Read: దేశమంతా కరోనా టీకా ఫ్రీ

అయితే మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ నిపుణుల బృందం తాజాగా అలర్జీ ఉన్న వారికి సంబంధించి జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునోలజీలో పరిశోధన ఫలితాలను ప్రచురించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒక మిలియన్ మందిలో అలర్జీ లక్షణాలు కనిపించడంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే కంగారు పడుతున్నారు. అయితే నిపుణుల బృందం మాత్రం అలర్జీ లక్షణాలు కనిపించినా మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లను తీసుకోవచ్చంటూ వెల్లడించింది.

Also Read: భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఎంతమందికి అవసరం..?

ఆహారం లేదా మెడిసిన్స్ వల్ల అలర్జీ కలిగిన వాళ్లు ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకున్నా ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణుల బృందం వెల్లడించింది. ఇప్పటికే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తీవ్రమైన అలర్జీ వచ్చిన వాళ్లు మాత్రమే వ్యాక్సిన్ కు దూరంగా ఉండాలని మిగిలిన వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవచ్చని నిపుణుల బృందం తెలిపింది.

మరిన్ని వార్తల కోసం కరోనా వైరస్ వార్తలు

ప్రతి పది లక్షల మందిలో 1.3 శాతం మంది అలర్జీ సమస్యతో బాధ పడుతున్నారని.. మెడిసిన్స్, ఫుడ్ వల్ల అలర్జీ వచ్చేవాళ్లు ఆందోళన చెందవద్దని నిపుణుల బృందం పేర్కొంది. తొలి డోస్ వల్ల అలర్జీ వస్తే వైద్యుడిని సంప్రదించి రెండో డోస్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని నిపుణుల బృందం సూచించింది.