https://oktelugu.com/

Mosquitoes : దోమలను తరిమి కొట్టే సింపుల్ చిట్కా ఇదే..

Mosquitoes : మనదేశంలో దోమల బెడద వేధిస్తుంది. ఏ కాలమైనా వాటి ప్రభావం తగ్గడం లేదు. సాయంత్రం అయిందంటే చాలు మన చుట్టూ మోత పెడుతూనే ఉంటాయి. దీంతో మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ దోమలు పాడుగాను అని చీదరించుకోవడం తప్ప మన చేయాల్సింది ఏమీలేదు. ఎన్ని దోమల మందులు వాడినా వాటితే మనకే ముప్పు ఏర్పడుతుంది తప్ప వాటికి ఏం కావడం లేదు. దాదాపు మూడు వేలకు పైగా దోమల జాతులున్నాయి. వీటితో మనకు డెంగీ, […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 20, 2023 / 12:04 PM IST
    Follow us on

    Mosquitoes : మనదేశంలో దోమల బెడద వేధిస్తుంది. ఏ కాలమైనా వాటి ప్రభావం తగ్గడం లేదు. సాయంత్రం అయిందంటే చాలు మన చుట్టూ మోత పెడుతూనే ఉంటాయి. దీంతో మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ దోమలు పాడుగాను అని చీదరించుకోవడం తప్ప మన చేయాల్సింది ఏమీలేదు. ఎన్ని దోమల మందులు వాడినా వాటితే మనకే ముప్పు ఏర్పడుతుంది తప్ప వాటికి ఏం కావడం లేదు. దాదాపు మూడు వేలకు పైగా దోమల జాతులున్నాయి. వీటితో మనకు డెంగీ, మలేరియా, ఫైలేరియా లాంటి వైరల్ జ్వరాలు వస్తున్నాయి. సరైన చికిత్స లేకపోతే ప్రాణాలే పోతున్నాయి. దోమ చిన్నదే కానీ దాని ప్రభావం ఇంతలా ఉంటుంది. అందుకే దోమలతో మనం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి.

    దోమల నివారణకు మనం వాడే మందులు ఎన్నో ఉన్నాయి. దేశంలో దాదాపు రూ. 25 వేల కోట్ల వ్యాపారం దోమల మందుల కోసమే జరుగుతోంది. అంతే మనం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నామో తెలుస్తోంది. దోమలను తరిమికొట్టేందుకు జెట్ కాయిల్స్, లిక్విడ్ డబ్బాలు ఉపయోగిస్తున్నాం. అయినా అవి చావడం లేదు కానీ మనల్ని చంపుతున్నాయి. దీంతో దోమల బాధ నుంచి విముక్తి కోసం రకరకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాం. కానీ అవి మాత్రం తగ్గడం లేదు. వాటి సంఖ్యను ఇంకా పెంచుకుంటున్నాయి.

    దోమలను తరిమి కొట్టడానికి ఓ అద్భుతమైన చిట్కా ఉంది. దీనికి మనం తీసుకోవాల్సిన పదార్థాల్లో వెల్లుల్లి రేకలు అరడజను, కర్పూరం, కొబ్బరి నూనె లేదా ఆవ నూనె లేదా ఆవు నెయ్యి కాని తీసుకోవచ్చు. వీటితో పాటు ఒక మట్టిపాత్ర తీసుకుంటే సరి. వెల్లుల్లి రేకలను కచ్చాపచ్చాగా దంచాలి. తరువాత కర్పూరం కూడా అలాగే దంచుకోవాలి. వాటిని ఒకదాని మీద ఒకటి వేసి తరువాత వాటి మీద కొబ్బరి నూనె వేసి అగ్గిపుల్లతో వెలిగించాలి. అంతే మంట వస్తుంది. మంట తగ్గిన తరువాత పొగ వెలువడి దోమలను గదిలో లేకుండా చేస్తుంది. ఇంత సులభమైన పద్ధతిలో దోమలను తరిమికొట్టొచ్చు.

    దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జెట్ బిల్లల వాసనతో మనకు అనారోగ్యం దరి చేరే ప్రమాదం ఉంటుంది. అందుకే మనకు ప్రకృతి సిద్ధంగా లభించే వాటితో పొగ వేసుకుని దోమలను లేకుండా చేసుకోవచ్చు. ఇంత చక్కని పరిష్కార మార్గం కావడతో అందరు విధిగా పాటించుకోండి. దోమలను తరిమికొట్టండి. మంచి హాయి గొలిపే నిద్రకు మార్గం సుగమం చేసుకోండి. ఇలాంటి మంచి పరిహారాలు పాటిస్తే మనకు అన్ని రకాల ప్రయోజనాలు దక్కుతాయనడంలో సందేహం లేదు.