soups : చలికాలంలో సూప్ లు తాగటం చాలా హాయిగా, ఆనందంగా, తృప్తిగా ఉంటుంది కదా. ఈ సూప్ లు ఆరోగ్యకరం కూడా. మీకు మంచి ప్రొటీన్లు ఉన్న సూప్ లు కావాలి అనుకుంటున్నారా? తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్ లు ఉండే సూప్‌ల రెసిపీలను తెలుసుకొని ట్రై చేయండి. ఇక వింటర్ లో మీకు మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ వెజిటబుల్ సూప్‌లు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. వీటితో కొవ్వు పెరగదు. మరి ఆ సూప్స్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఈ చలికాలంలో హార్టీ, ప్రొటీన్-ప్యాక్డ్ సూప్‌లతో మీరు వేడెక్కండి. అంటే వెచ్చగా ఉండండి అని బాస్ మీనింగ్. మిమ్మల్ని హాయిగా, ఉత్సాహంగా ఉంచడానికి ఇక్కడ ఏడు పోషకమైన వంటకాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.
లెంటిల్ సూప్ ఇదేంటి వినడానికి కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారా? వెయిట్. ఉల్లిపాయలు, టమోటాలు, సుగంధ ద్రవ్యాలతో ప్రోటీన్-ప్యాక్డ్ కాయధాన్యాలు ఉడకబెట్టి చేస్తారు. ఈ చలికాలంలో మీకు మంచి పోషకాలు అందించడానికి మిమ్మల్ని వెచ్చగా ఉంచడానికి మీరు ఎంజాయ్ చేయదగ్గ హృదయపూర్వక సూప్. స్పినాచ్ సూప్ లో కూడా చాలా ప్రొటీన్లు లభిస్తాయి. బచ్చలికూర, వెల్లుల్లి, క్రీమ్‌లు అన్ని సీజన్లలో మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికి పోషకాలతో కూడిన వెల్వెట్, ప్రోటీన్-రిచ్ సూప్‌ను సృష్టిస్తాయి. ఒకసారి తయారు చేసి మీ డైట్ లో కాస్త చేర్చుకోండి.
బఠానీల సూప్ కూడా బాగుంటుంది. ప్రొటీన్ లు లభిస్తాయి. ఈ సీజన్ లో ఫ్రెష్ బఠానీలు లభిస్తాయి. వీటిని తీసుకొని మీరు పరాఠా చేసుకోవచ్చు. సూప్ లు తయారు చేసుకోవచ్చు. బ్రైట్ గ్రీన్ బఠానీలు పుదీనాతో మిళితం చేసి తయారు చేసుకోవచ్చు. ప్రతి స్పూన్ ఫుల్ లో ప్రోటీన్ ఉంటుంది. మంచి రుచి అందుతుంది.
చికెన్ సూప్ చాలా మందికి ఇష్టం కదా. ఇందులో కూడా చాలా ప్రొటీన్ లు ఉంటాయి. చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచగల మంచి సూప్ కూడా. కూరగాయలతో సువాసనగల పులుసులో లేత చికెన్ ముక్కలు వేస్తే ఆ టేస్టే వేరప్ప. శీతాకాలపు సాయంత్రాలకు అనువైన క్లాసిక్, ప్రోటీన్-రిచ్ సూప్ ఈ సూప్. మరి ఓ సారి మీరు కూడా టేస్ట్ చేసి ప్రొటీన్ లను పొందండి. చికెన్, బార్లీ సూప్ కూడా మీకు మంచి ప్రొటీన్ లను అందిస్తాయి. లేత చికెన్, హార్టీ బార్లీ లతో ఈ సూప్ ను తయారు చేసుకోవచ్చు. ప్రొటీన్ లు ఎక్కువగా ఉండే కూరగాయలతో ఈ సూప్ ను తయారు చేసుకోవాలి. చల్లటి రోజులకు వేడిని అందిస్తుంది ఈ సూప్.