Homeట్రెండింగ్ న్యూస్Cancer Symptoms: ఈ లక్షణాలు క్యాన్సర్ కు సంకేతాలు: ముందుగా గుర్తిస్తేనే ప్రాణాపాయం రక్షణ

Cancer Symptoms: ఈ లక్షణాలు క్యాన్సర్ కు సంకేతాలు: ముందుగా గుర్తిస్తేనే ప్రాణాపాయం రక్షణ

Cancer Symptoms: క్యాన్సర్ సోకితే కథ కంచికే అనుకుంటాం.. కానీ తగినంత అప్రమత్తతతో వ్యాధిని ముందుగానే కనిపెట్టగలిగితే క్యాన్సర్ నుంచి రక్షణ పొందడం సాధ్యమే.. అంతేకాదు ముందుగా మన శరీరంలో కనిపించే లక్షణాలను త్వరగా గమనించి… తాజా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని, చికిత్స పొందితే క్యాన్సర్ వ్యాధి నుంచి సులభంగా జయించవచ్చు.. హాయిగా జీవించవచ్చు.

Cancer Symptoms
Cancer Symptoms

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్.. క్యాన్సర్ రావడానికి ముందు శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి.. తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్ని కోల్పోతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.. క్యాన్సర్ మొదటి దశలో కనిపించే లక్షణాలను సీరియస్ గా తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.

క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి.. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా వస్తుంది.. శరీరంలోని కణాలు అదుపు లేకుండా పెరిగినప్పుడు క్యాన్సర్ వస్తుంది.. క్యాన్సర్ సోకేమందు శరీరంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి.. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొ రెక్టల్ , కడుపు, లివర్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి.. మహిళల లో బ్రెస్ట్, కొలొరెక్టల్, ఊపిరి తిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తుంటాయి.

క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్ని కోల్పోతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.. క్యాన్సర్ మొదటి దశలో కనిపించే లక్షణాలను సీరియస్ గా తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. క్యాన్సర్ తొలిదశలో విపరీతమైన అలసట, ఆకలి తగ్గడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, రొమ్ము లేదా శరీరంలోని ఇతర భాగం గట్టి పడటం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.. వీటిని గమనించి పరీక్షలు చేయించుకుంటే మంచిది.

Cancer Symptoms
Cancer Symptoms

క్యాన్సర్ మొదటి దశలో బరువు తగ్గుతారు.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందుతున్నప్పుడు మెటా స్టేజ్ లు విస్తరిస్తున్న సమయంలో క్యాన్సర్ కణాలు వాటి జీవ క్రియ కోసం సాధారణ కణాల కంటే ఎక్కువగా శక్తిని కోల్పోతాయి.. దీనివల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి.. దీంతో అకస్మాత్తుగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కణాల వృద్ధి కారణంగా వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.. దీంతో ఆహారం తీసుకోవడం తక్కువవుతుంది

దగ్గు రావడానికి చాలా కారణాలు ఉంటాయి.. వాతావరణంలో మార్పు, కొన్ని వ్యాధుల వల్ల దగ్గు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.. బ్రాంకైటిస్, ఆస్తమా, కోవిడ్, క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ దగ్గుకు కారణం కావచ్చు.. నాలుగు వారాలకు పైగా కొనసాగుతుంటే, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడాల్సి ఉంటుంది.. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతం కావచ్చు.. వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.

సాధారణంగా ఫైల్స్ సమస్య ఉంటే తప్ప మలం నుంచి రక్తం ఎప్పుడూ పడదు.. మలం నుంచి రక్తం పడితే కంగారుపాల్సిన విషయమే. ఇది పెద్ద పేగు, కొలన్ క్యాన్సర్, ఇంట స్టైనల్ వాల్ క్యాన్సర్ సిగ్నల్ కావచ్చు.

క్యాన్సర్ నిర్ధారణ తర్వాత చాలామంది ఆందోళన, నిరాశకు గురవుతూ ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.. కానీ బ్రెయిన్ ట్యూమర్ మొదటి దశలోనూ ఆందోళన, నిరాశ వెంటాడుతూ ఉంటాయి. నెలసరి సమయంలో కాకుండా బ్లీడింగ్ అవుతున్నట్లయితే అది హార్మోన్ల అసమతౌల్యానికి సంకేతం మాత్రమే కాదు… ప్రమాదకర వ్యాధులకు సంకేతం.. ముఖ్యంగా మోనో పాజ్ సమయంలో రక్తస్రావం అవుతుంటే… ఇది కాకుండా, కోయి టల్ బ్లీడింగ్, పెరి మెనో పౌసల్ బ్లీడింగ్, ఇంటర్ మెన్ స్ట్రువల్ బ్లీడింగ్ ను తేలికగా తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది గర్భాశయ క్యాన్సర్ కు సంకేతం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో దాదాపు 90 శాతం మందికి నెలసరి కాకుండా బ్లీడింగ్ అవుతుంది.. అండాశయ క్యాన్సర్ లోనూ క్షణం కనిపిస్తుంది.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం క్యాన్సర్ మొదటి దశలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.. అలసట, విశ్రాంతి తీసుకున్నప్పటికీ తగ్గకపోవడం, కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలిగా అనిపించకపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు, శరీరంలో ఎక్కడైనా వాపు లేదా గడ్డలు, అమ్మ లేదా శరీరంలోని ఇతర భాగంలో గట్టిపడటం, ఏ కారణం లేకుండా నొప్పి, నొప్పి తగ్గకుండా అధ్వానంగా మారటం, కొత్త పుట్టుమచ్చ, పుట్టుమచ్చలో మార్పు, పుండ్లు నయం కాకపోవడం, చర్మం పసుపు రంగులోకి మారడం, చర్మంపై మార్పులు, దగ్గు, గొంతు బొంగురు పోవడం, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం పడటం, లేదా రాత్రులు చమటలు పరీక్షలు చేయించుకుని, త్వరగా చికిత్స పొందితే క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular