Adhika Sravana Masam 2023: ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం వచ్చింది. 19 ఏళ్ల క్రితం వచ్చిన అధిక శ్రావణ మాసం ఈ ఏడాది రావడం గమనార్హం. దీంతో కొన్ని రాశుల వారికి శుభాలు కలగనున్నాయి. శ్రావణ మాసంలో గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి జీవింతో ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఐదు రాశులకు ఈ రెండు నెలల కాలం అదృష్ట యోగం పట్టనుంది. వీరు అనుకున్న పనులు పూర్తిచేసుకుంటారు. మేష, మిథున, సింహ, వృశ్చిక, ధనస్సు రాశి వారికి ఈ ఫలితాలు దక్కనున్నాయి.
మేష రాశి వారికి శుభాలు కలగనున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పనుల్లో ఆటంకాలు ఉండవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావు. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇలా అధిక శ్రావణం వల్ల వీరికి ఎంతో మంచి ఫలితాలు దక్కనున్నాయని తెలుస్తోంది.
మిథున రాశి వారికి కూడా బాగా కలిసొస్తుంది. ధన యోగం ఉంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. అధిక శ్రావణం వీరికి మంచి ఫలితాలు ఇస్తోంది. డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూల కాలం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఎంతో శుభాలు ఇచ్చే కాలంగా చెబుతున్నారు.
సింహ రాశి వారికి అధిక శ్రావణం మంచి ప్రయోజనాలు ఇస్తుంది. వ్యాపారంలో అధిక లాభాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. పదోన్నతులు అందుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. అధిక శ్రావణం వల్ల ఈ రాశి వారికి ఇంకా అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి.
ధనస్సు రాశి వారికి కూడా మంచి లాభాలు రానున్నాయి. కెరీర్ బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంకా వీరికి అనుకూలంగా పరిస్థితులు మారనున్నాయి. చేపట్టే పనుల్లో కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నాు.
వృశ్చిక రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు అందుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషం కలుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో నెరవేరతాయి. దీంతో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.