
చైనా దేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా వైరస్ రూపాన్ని మార్చుకుంటూ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను తెగ టెన్షన్ పెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మాత్రమే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. యాంటీ వైరల్ గుణాలు ఉన్న కొన్ని ఆహార పదార్థాలను మనం ప్రతిరోజూ తీసుకుంటే మంచిది.
మనం రోజూ ఆహార పదార్థాల ద్వారా తీసుకునే వెల్లుల్లి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షించడంలో తోడ్పడుతుంది. చారు, సలాడ్, కూరలలో వెల్లుల్లిని వేసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్ల బారినా పడే అవకాశాలు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే విష పదార్థాలు శరీరంలో పేరుకుపోకుండా చేయడంలో అల్లం ఉపయోగపడుతుంది. టీ, కషాయం, చట్నీ, కూరలలో అల్లం తీసుకుంటే సులువుగా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే పసుపు జలుబు, ఫ్లూ, ఇతర అనారోగ్య సమస్యల నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది. పసుపుతో తయారు చేసినా ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. పసుపులో శరీరానికి మేలు చేసే శక్తివంతమేన సమ్మేళనాలు కూడా ఎన్నో ఉంటాయి. వీటితో పాటు లెమన్ బామ్ జలుబును నియంత్రించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. సూపర్ మార్కెట్ల ద్వారా మనం లెమన్ బామ్ ను కొనుగోలు చేయవచ్చు.
లెమన్ బామ్ సహాయంతో హెర్పిస్ సింప్లెస్ లాంటి వైరస్ కారక ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో లెమన్ బామ్ తోడ్పడుతుంది. ఈ ఆహార పదార్థాలను మనం చేసే వంటకాల్లో వినియోగిస్తే కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయి.