Salt : అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అన్నట్లు ఉప్పు లేనిదే కూరకు రుచి రాదని చెబుతారు. కానీ ఉప్పుతో చాలా రోగాలు ముడిపడి ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో ఉప్పును కూరల్లో బాగా వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు కానీ దాంతో వచ్చే ప్రతికూల ఫలితాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా నూరేళ్లు జీవించాల్సిన శరీరాన్ని యాభై ఏళ్లకే గుళ్ల చేసుకుంటున్నారు. షుగర్, బీపీ, గుండెజబ్బులకు మూలమైన ఉప్పును వాడందే ఉండటం లేదు. దీంతో రోగాల కుంపటిలా మారుతున్నా ఉప్పును మాత్రం వదలడం లేదు. ఉప్పు ఎక్కువగా తింటున్నారంటే మీ పతనం మీరు కోరుకున్నట్లే.
ఉప్పు లేనిదే కూరకు రుచి ఉండదు. అది వేస్తే మనకు ఇబ్బంది. ఉప్పు వల్ల కలిగే ముప్పులను మాత్రం తెలుసుకోవడం లేదు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటుకు కారణమవుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. పక్షవాతానికి కూడా ఉప్పే కారణమనే విషయం ఎంతమందికి తెలుసు. ఇలా ఉప్పు మన జీవితంలో ఉప్పెనలా దూసుకువస్తుందని చాలామందికి నిజంగా తెలియకపోవడం విడ్డూరమే. సైన్స్ ఇంత పెరిగినా మనిషిలో చైతన్యం మాత్రం పెరగడం లేదు. కచ్చితంగా మానేయాల్సిన వాటిని తింటూ అనర్థాలు తెచ్చుకుంటున్నాడు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పెంచుకుంటున్నాడు.
కూరల్లో ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. అంతేకాని విచ్చలవిడిగా చల్లుకుంటే దాంతో మనకు ఉపద్రవమే. ఉప్పుతో చేసే నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అందులో ఉప్పు, నూనె ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలిసిందే. కానీ ఆవకాయకు తెలుగువారు బానిసలు. జాడీలకు జాడీలు తినడం మనకు పూర్వం నుంచి ఉన్న అలవాటే. కానీ దాన్ని మానుకోవడమే శ్రేయస్కరం. లేదంటే దాంతో మనకు ఎన్నో నష్టాలు వస్తాయనడంలో సందేహం లేదు.
బేకరీ ఫుడ్స్ లో ఉప్పు సత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని కూడా మానేయడం మంచిది. భోజనం చేసే సమయంలో దగ్గర్లో ఉప్పు ఉంచుకోకుండా జాగ్రత్త వహించాలి. పెరుగు, మజ్జిగలో ఉప్పు కలుపుకోవద్దు. ఉప్పుకు బదులు వెల్లుల్లి, అల్లం, నిమ్మరసం, వెనిగర్ కలుపుకుంటే ఇంకా మంచిది. వంటల్లో అయోడిన్ కలిపిన ఉప్పును వాడుకుంటే కొంతవరకు ఉపశమనం. ఉప్పు వాడకాన్ని ఎంత వీలయితే అంత తగ్గిస్తూ దాన్ని పూర్తిగా దూరం చేసుకోవడమే ఉత్తమం. ఉప్పు వల్ల ఇన్ని అనర్థాలని తెలిసినా మన వారు మానడం లేదు. దీంతో శరీరానికి ఇబ్బందులు వస్తున్నా దాన్ని దూరం చేయడం లేదు. మన ఆరోగ్యంపై విష ప్రభావాన్ని చూపే ఉప్పును శాశ్వతంగా మానేస్తేనే మంచిదనే విషయం గ్రహించుకుంటే మంచిది.