Reheat Foods: మనం తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ఇష్టానుసారం ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి అదే స్థాయిలో కీడు జరుగుతుంది. మనలో కొంతమంది చల్లారిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటూ ఉంటారు. అయితే కొన్ని ఆహారాలను వేడి చేసి తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.
పోషకాహార నిపుణులు సైతం వేడి చేసుకుని ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఐదు ఆహార పదార్థాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సంబంధిత సమస్యలు వేధించకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పాలకూరతో వండిన వంటకాలను మళ్లీ వేడి చేయకూడదు. పాలకూరలో ఎక్కువ గాఢత ఉన్న నైట్రేట్ ఉంటుంది.
Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు కట్టాలంట.. జగన్ పెద్ద ప్లానే వేశారే..!
పాలకూరను మళ్లీ వేడి చేస్తే ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. పుట్టగొడుగులను కూడా మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. పుట్టగొడుగులను మళ్లీ వేడి చేసి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బంగాళదుంపలను ఉడికించిన తర్వాత మళ్లీ వేడి చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు.
మనం ప్రతిరోజూ ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలలో అన్నం ఒకటనే సంగతి తెలిసిందే. అన్నం వేడి చేసి తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. ఎప్పుడు ఆకలైతే అప్పుడు అన్నం వేడి చేసుకుని తింటే మంచిదని చెప్పవచ్చు. కోడి మాంసంను కూడా ఒకసారి వేడి చేసిన తర్వాత మళ్లీ వేడి చేయకూడదు. ఎక్కువసార్లు వేడి చేయటం వల్ల శరీరంలో పోషకాలు అందకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: జగ్గారెడ్డి రాజీనామాను ఆమోదిస్తుందా? అడ్డుకుంటుందా?