https://oktelugu.com/

Cooking Oils: ఈ వంటనూనెలను వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువట.. తస్మాత్ జాగ్రత్త?

Cooking Oils: వంటనూనెను వినియోగించకుండా ఎక్కువ సంఖ్యలో వంటకాలను చేయలేమనే సంగతి తెలిసిందే. దేశంలో రోజురోజుకు వంట నూనె వినియోగం అంచనాలను మించి పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మన దేశంలో ఎక్కువగా పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ను వంట నూనెల కోసం వినియోగిస్తున్నారు. అయితే పామాయిల్, సన్ ఫ్లవర్ అయిల్ లను వేడి చేస్తే వాటి నుంచి వచ్చే కెమికల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వంటనూనెలో ఉండే […]

Written By: , Updated On : April 23, 2022 / 12:28 PM IST
Follow us on

Cooking Oils: వంటనూనెను వినియోగించకుండా ఎక్కువ సంఖ్యలో వంటకాలను చేయలేమనే సంగతి తెలిసిందే. దేశంలో రోజురోజుకు వంట నూనె వినియోగం అంచనాలను మించి పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మన దేశంలో ఎక్కువగా పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ను వంట నూనెల కోసం వినియోగిస్తున్నారు. అయితే పామాయిల్, సన్ ఫ్లవర్ అయిల్ లను వేడి చేస్తే వాటి నుంచి వచ్చే కెమికల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వంటనూనెలో ఉండే పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు వేడి చేసిన సమయంలో ఆల్డిహైడ్ గా విచ్ఛిన్నమై క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని వేర్వేరు క్యాన్సర్లతో సంబంధం కలిగి ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే క్యాన్సర్ రిస్క్ ను ఎవరైనా తగ్గించుకోవాలని భావిస్తే మాత్రం ఆల్డిహైడ్ పరిమాణం తక్కువగా ఉన్న కొవ్వు, వెన్న తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.

క్యాన్సర్ రావడానికి వంటనూనెతో పాటు వేర్వేరు కారణాలు ఉన్నాయి. వంటనూనెను ఎక్కువగా వినియోగించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మనలో కొంతమంది వేయించిన ఆహారంను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ఇలా వేయించిన వంటకాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం, కొలెస్ట్రాల్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

మనం నిత్యం తినే వంటకాలే మన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. క్యాన్సర్ కణాలను సకాలంలో గుర్తిస్తే మాత్రమే మనకు ప్రాణాపాయం కలిగే అవకాశం అయితే ఉండదు. తినే వంటకాల గురించి సరైన అవగాహన లేకుండా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.