Diabetes Diet: మధుమేహాన్ని తగ్గించే ఆహారాలు ఇవే..

మధుమేహం ఉన్న వారికి దానిమ్మ ఓ మందులాంటిది. దీంతో ఎన్నో రకాల రోగాలు దూరమవుతాయి. ఇది చక్కెరను నియంత్రిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ఉత్తమం.

Written By: Srinivas, Updated On : May 18, 2023 1:55 pm

Diabetes Diet

Follow us on

Diabetes Diet: డయాబెటిస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. దీంతో వారు తీసుకునే ఆహారాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారు తినే పండ్లవిషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గేందుకు పలు చిట్కాలు పాటిస్తుంటారు. ఆహారం కూడా ఏది పడితే అది తినకూడదు. అలా చేస్తే షుగర్ లెవల్స్ పెరిగితే కష్టాలు పడాల్సి ఉంటుంది.

దానిమ్మ

మధుమేహం ఉన్న వారికి దానిమ్మ ఓ మందులాంటిది. దీంతో ఎన్నో రకాల రోగాలు దూరమవుతాయి. ఇది చక్కెరను నియంత్రిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ఉత్తమం. ఈ నేపథ్యంలో దానిమ్మ గింజలను రోజు తినడం వల్ల మనకు ఎంతో ఉపశమనం కలుగుతుందనడంలో సందేహం లేదు.

యాపిల్

యాపిల్ కూడా షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు పోవాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. దీంతో ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. డయాబెటిస్ టైపు 2 అదుపులో ఉంచేందుకు సాయపడుతుంది. యాపిల్ ను రోజువారీ ఆహారంలో భాగగా తీసుకోవడం ఎంతో అవసరం.

జామ

ఇది పండ్లలో మేటి. అత్యధిక పోషకాలు ఉన్న పండుగా దీనికి గుర్తింపు ఉంది. దీన్ని ఆహారంగా చేసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ మనకు ఎంతో దోహదపడుతుంది. రక్తంలో చక్కెరను తగ్గించడంలో దీని పాత్ర కీలకం. అందుకే రోజు మనం ఓ జామకాయ తింటే షుగర్ అదుపులో ఉండటం ఖాయం. జామలో మలబద్ధకాన్ని తగ్గించే గుణం ఉండటం గమనార్హం.

నల్లద్రాక్ష

మధుమేహం ఉన్న వారు పచ్చ ద్రాక్ష కు బదులు నల్ల ద్రాక్ష తినడం ఎంతో మేలు. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అందుకే నల్ల ద్రాక్షలు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు వారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పుచ్చకాయ

వేసవిలో లభించే పండ్లలో ఇది ప్రధానమైనది. ఇందులో తొంభై శాతం నీరే ఉంటుంది. ఇది తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం వల్ల ఇది కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది. డీహైడ్రేషన్ సమస్య రాకుండా చేస్తుంది. అందుకే పుచ్చకాయను రోజు తినడం మంచిదే. ఇలా మనకు లభించే పండ్లతో షుగర్ ను కంట్రల్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.