Summer Fruits: వేసవి ఈసారి ముందే వచ్చింది. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు కొడుతున్నాయి. మార్చి తొలి వారం నుంచే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదువుతున్నాయి. దీంతో ప్రజలు వేడి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎండలో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమై ఒటిపూట బడులను నిర్వహిస్తోంది. ఎండలో పనిచేసేవారు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరం కూడా వేడి చేసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. వేసవిలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే ఐదు రకాల పండ్లను సూచిస్తున్నారు.
ఖర్బూజా..
ఈ పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా నిరోధిస్తుంది. డీహైడ్రేషన్ కాకుండా చూస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఖర్జూజా పండు కూడా కేవలం వేసవిలోనే వస్తుంది. అందుకే ఈ పండు ఎక్కువగా తినాలని ఆరోగ్య నిఫుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ..
ఇక వేసవిలో తీసుకోవాల్సిన మరో పండు పుచ్చకాయ. ఇందులో కూడా నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది. వేడి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది.
మామిడి..
వేసవిలో లభించే సీజనల్ ఫ్రూట్ మామిడి. ఇది పండ్లకు రాజు. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే ఎక్కువగా తింటే శరీరానికి వేడి చేస్తుంది.
బొప్పాయి..
వేసవిలో తీసుకోవాల్సిన మరో పండు బొప్పాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఫోలియేట్, ఫైటోకెమికల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. అయితే బొబ్బాయి కూడా శరీరానికి వేడి చేస్తుంది. మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
జామ..
వేసవిలో తప్పక తీసుకోవాల్సిన మరో పండు జామ. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచింది. షుగర్ పేషెంట్లు కూడా జామ పండు తినవచ్చు. వేసవిలో దొరికే ఈ పండు అందరూ తినాలని సూచిస్తున్నారు.