Weight Loss Tips
Weight Loss Tips: ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అందరిని కలవరపెడుతోంది. దీంతో నలుగురిలో తిరగలేకపోతున్నారు. పెళ్లి చేసుకునే వారు కూడా వివాహం కావడం లేదని బాధపడుతున్నారు. పెళ్లయిన వారు సంతానలేమి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఊబకాయంతో సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి సులభమైన చిట్కాలు ఉన్నాయి. అధిక బరువు సమస్యను చిటికెలో మాయం చేసే చిట్కాలున్నా వాటిని పాటించడం లేదు. ఫలితంగా ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు.
బూడిద గుమ్మడి రసం
ఆరునెలల పాటు మన దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటే అధిక బరువు సమస్య నుంచి విముక్తి కావొచ్చు. మన జీవన శైలిలో చాలా వరకు తగ్గించుకోవాలి. అలాగైతే అధిక బరువు సమస్య దూరం కావడం సహజమే. దీని కోసం ఉదయం చేసే అల్పాహారంలో ఒక గ్లాసు బూడిద గుమ్మడి రసం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీంతో చాలా రోగాలు దూరమవుతాయి.
క్యారట్, బీట్ రూట్ రసం
ఒక క్యారట్, ఒక బీట్ రూట్, గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని తేనెతో తాగడం వల్ల మంచి లాభాలుంటాయి. ప్రొటీన్ల లోపం లేకుండా ఉండాలంటే మొలకలు తినడం మంచిది. ఇందులో ఏవైనా మూడు రకాల గింజలను మొలకలుగా చేసుకుని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఎక్కువ తినే అవకాశం ఉండదు.
సలాడ్స్
ఎక్కువగా కూరలు తీసుకోవాలి. ఇందులో నూనె శాతం తక్కువగా ఉంటుంది. కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. రోజు అన్నంకు బదులు పుల్కాలు తింటే లాభాలు పుష్కలంగా ఉంటాయి. అలా తినలేకపోతే కూరలు కాకుండా సలాడ్స్ తీసుకుంటే ఇంకా బెటర్. సాయంత్రం చెరుకు రసం తీసుకుంటే బాగుంటుంది. సాయంత్రం ఆహారంగా పండ్లు తీసుకోవాలి. పండ్లు కడుపులో సులభంగా జీర్ణం అవుతాయి. అందుకే సాయంత్రం పండ్లు తినడం ఉత్తమం.