Most Dangerous Foods: కాలం మారుతున్న కొద్ది జీవనం కూడా మారిపోతుంది. గతంలో కంటే ఇప్పుడు రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా రుచికరమైన ఫుడ్స్ మార్కెట్లో ఉండడంతో చాలామంది వీటిని టెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో అనేక రకాల రసాయనాలు.. ఆహార పదార్థాలను కలపడం వల్ల వీటిని తినడంతో అనారోగ్యంబారిన పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఫేమస్ అయినా కొన్ని ఆహార పదార్థాలు త్వరగా అనారోగ్యానికి గురిచేస్తాయన్న విషయం కొంతమందికే తెలుసు. మరి వాటిలో అత్యంత ప్రమాదకరమైన ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
కేక్స్:
ఏ చిన్న సెలబ్రేషన్ చేసుకున్న కేక్ తప్పనిసరిగా ఉంటుంది. మిగతా పదార్థాల కంటే ఇది అత్యంత రుచిగా ఉంటుంది. అందుకే దీనిని పిల్లలు చాలా ఇష్టపడతారు. కేక్ తినడం వల్ల బరువు పెరగడం, హృదయ సమస్యలు ఉంటాయి. వీటి తయారీలో చక్కెర, నెయ్యి, బట్టర్, క్రీమ్, మైదా ఎక్కువగా వాడుతుంటారు. పదేపదే కేక్ తినడం వల్ల డయాబెటిక్ వ్యాధిన త్వరగా పడే అవకాశం ఉంది. కొందరిలో గుండె సమస్యలు కూడా రావచ్చు. అందువల్ల తక్కువ మోతాదులో దీనిని తీసుకోవడం మంచిది.
బర్గర్:
సిటీలో ఎక్కువగా ఉండేవారు ప్రతిరోజు బర్గర్ తినే వారు కూడా ఉన్నారు. బర్గర్ తయారీలో మైదా బ్రెడ్, రియూజ్ చేసిన ఆయిల్, చీజ్, మయోనైజ్ వంటివి వాడుతారు. ఇవి ఉన్న పదార్థాలను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మధుమేహం కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది. దీని తయారీలో మసాలాలు కూడా వాడుతారు. ఫలితంగా జీర్ణ సమస్యలు రావచ్చు. తరచూ బర్గర్ తినేవారు ఫ్యాటీ లివర్ సమస్యలను ఎదుర్కోవచ్చు.
పొటాటో చిప్స్:
చిన్నపిల్లలు స్కూలుకు వెళ్లడానికి మారం వేస్తే చాలామంది తల్లిదండ్రులు వీటిని కొనుగోలు చేసి వారికి ఇస్తుంటారు. కానీ వీటి వల్ల ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిప్స్ తయారీలో రియూజ్డ్ ఆయిల్, ఉప్పు ఎక్కువగా వాడుతారు. అలాగే పొటాటోలను డీప్ గా ఫ్రై చేస్తారు. ఇలా చేసిన వాటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే ఇందులో సాల్ట్ శాతం కూడా ఎక్కువగా ఉండడంతో బీపీ పెరిగే అవకాశం ఉంది. కొంతమందిలో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావచ్చు.
కూల్ డ్రింక్స్:
వేసవికాలంలో చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండలేరు. ఏదైనా ఫంక్షన్ లేదా ప్రత్యేక కార్యక్రమం జరిగినప్పుడు కూడా వీటిని తీసుకువస్తూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్ లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. పదేపదే కూల్ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి నిలువలు పేరుకుపోయే అవకాశం ఉంది. ఫలితంగా త్వరగా డయాబెటిక్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఇందులో పాస్పరిక్ యాసిడ్, కాల్షియంను తగ్గించే కారకాలు ఉంటాయి. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి.
ప్రాసెస్ ఫుడ్:
బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే చాలామంది వీటికోసం ఆసక్తి చూపుతారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రాసెస్ చేసిన ఫుడ్ లో క్యాన్సర్ కారకాల పదార్థం ఉంటుందని ధ్రువీకరించబడింది. వీటిని ఎక్కువగా తినడం వల్ల కోలన్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.