Watching Shorts Side Effects: ఒకప్పుడు ప్రపంచం గురించి తెలుసుకోవాలని అనుకుంటే టీవీలు చూసేవాళ్ళం.. పేపర్లు చదివే వాళ్ళం.. కానీ ఇప్పుడు మొబైల్ లోనే ప్రపంచం ఉంటోంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో కొన్ని ఉపయోగకర వీడియోలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటితోపాటు మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీవల ఎక్కువనిడివి ఉన్న వీడియోల కంటే షాట్స్ చూస్తూ లోకజ్ఞానం తెలుసుకుంటున్నారు. ఒక షార్ట్ లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంతో చాలామంది షార్ట్ చూస్తున్నారు. అయితే వీటిని గంటల తరబడి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా షార్ట్స్ ను స్వైప్ చేస్తూ చూస్తుంటారు. మరి ఇలా షార్ట్స్ స్వైప్ చేస్తూ చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మనం చేసే ప్రతి పని మెదడుతో సంబంధం ఉంటుంది. మంచి పనులు చేసేవారి మెదడులో మంచి ఆలోచనలు వస్తుంటాయి. అలాగే మెదడులో వ్యతిరేక ఆలోచనలు ఉంటే చెడు పనులు చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో మెదడును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మొబైల్ చేతిలోకి వచ్చినాక చాలామంది చేయరాని పనులన్నీ చేస్తున్నారు. అందుకు కారణం మెదడులో డోకోమైన్ రిలీజ్ కావడమే. కంటిన్యూగా షార్ట్స్ చూడడం వల్ల మెదడులో ఉండే రివార్డు సిస్టంను డోపో మైన్ డామేజ్ చేస్తుంది. దీంతో మెదడు పనితీరు వ్యతిరేకంగా మారుతుంది.
సాధారణంగా షార్ట్స్ చూడడం వల్ల కొంతమంది తాత్కాలికంగా సంతోషాన్ని పొందుతారు. కానీ ఇది లాంగ్ పీరియడ్ లో మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా స్ట్రెస్ కు గురవడం.. అనుకోకుండానే నవ్వడం.. కాన్సన్ట్రేషన్ లేకపోవడం.. ఏ పని చేయడానికి ఉత్సాహం రాకపోవడం వంటివి జరుగుతాయి. మెదడులో ఉండే కణాలు వ్యతిరేక దిశలో పనిచేసి ఒక మనిషి యొక్క ప్రవర్తన తీరును మారుస్తాయి. ఎక్కువగా షార్ట్ చూసేవాళ్ళు వారి ఆలోచనలను కూడా మారుస్తాయి. అంటే అనుకోకుండానే తప్పులు చేయడం.. చిన్న తప్పుకి పెద్దగా బాధపడడం.. ఇతరులపై అనవసరంగా కోపానికి తెచ్చుకోవడం వంటివి జరుగుతాయి.
అంతేకాకుండా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి సరైన ఆలోచన రాకుండా చేస్తుంది. దీంతో ఎటువంటి ఆలోచన లేదనే బాధతో కృంగిపోతుంటారు. ఇతరులతో కలిసిమెలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్లే వచ్చి.. ఆ తర్వాత డిప్రెషన్కు లోనవుతుంటారు. కంటిన్యూగా షార్ట్స్ చూడడం వల్ల కళ్ళపై కూడా ప్రభావం పడుతుంది. అంతకుముందు కంటే ఎక్కువగా షార్ట్స్ చూస్తే దృష్టిలోపం ఏర్పడుతుంది.
ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా షార్ట్స్ చూసే వారిలో డ్యామేజ్ అయ్యే బ్రెయిన్.. ఆల్కహాల్ తాగిన వారి కంటే ఎక్కువగా ఉంటుందని కొందరు సైంటిస్టులు తెలుపుతున్నారు. ప్రతిరోజు ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే షార్ట్స్ చూడాలని.. అంతకుమించి ఎక్కువగా వీటిని చూడడం వల్ల నిద్రలేమి కూడా ఉంటూ మానసికంగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అయితే షార్ట్స్ చూడొద్దని చెప్పడం కాదు.. అవసరం అయినా కంటెంట్ ను మాత్రమే తక్కువసేపు చూసి ఆ తర్వాత మొబైల్ ను పక్కన వస్తే బెటర్.