Marriage Vow: మన దేశంలో హిందూ వివాహ వ్వవస్థలో ఎన్నో విషయాలపై ప్రమాణాలు చేస్తున్నాం. కానీ వాటి గురించి మనకు తెలియదు. ఎందుకంటే అవి సంస్కృతంలో ఉంటాయి. సనాతన సంప్రదాయ వ్యవస్థ కావడంతో పాశ్చాత్యులు సైతం మన ఆచార వ్యవహారాలకు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో వివాహంలో భార్యాభర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. మా అమ్మ, మా అన్న, మా అక్క అంటారు కానీ ఒక భార్యను మాత్రం నా భార్య అని చెబుతాం. అంటే జీవితంలో ఒకరికే భార్య అవుతుంది. ఒకరినే తమ భర్తగా ఊహించుకుంటుంది. అందుకే అలా చెబుతారు. అంతటి ప్రాధాన్యం గల భార్యను అపురూపంగా చూసుకోవాల్సిందే ఆమె అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిందే. కుటుంబంలో ఆమెకు కూడా సముచిత స్థానం కేటాయించాల్సిందే.
భార్యాభర్తల బంధం ఓ అపురూపమైన సంబంధం. జీవితాంతం కలిసుండే స్నేహితులు. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. అంటే పెళ్లి అనే బంధంతో ఇద్దరు ఒక్కటి కావడం గమనార్హం. అదే మన హిందూ సంప్రదాయం. అందుకే విదేశీయులు సైతం మన బంధానికి విలువ ఇస్తారు. ఆచరించడానికి ప్రయత్నిస్తారు. మన విధానం చూసి మురిసిపోతుంటారు. ఆలుమగలంటే సృష్టికే ఆదిదంపతులుగా అభివర్ణిస్తారు. అంతటి మహత్తరమైన శక్తి భార్యాభర్తలకు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. నేటి ఆధునిక కాలంలో వివాహమే అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. దీని కోసమే అందరు కూడా తలవంచుతున్నారు. కాబోయే జీవిత భాగస్వామి కోసం తపిస్తున్నారు. ఆమెతోనే జీవితాంతం కలిసి నడిచేందుకు ముందుకు వస్తున్నాడు.
Also Read: Megastar Chiranjeevi Holiday Trip: ఒకపక్క మేము చనిపోతుంటే.. మీకు సరదాలు కావాలా చిరంజీవి ?
పెళ్లిలో పంతులు వరుడి చేతి చేయించే ప్రమాణాలకు అర్థం తెలిస్తే ఏ మగాడు కూడా భార్యను చిన్నచూపు చూడడు. వివాహంలో ధర్మేచ కామేచ మోక్షేచ అర్థేచ నాతి చరితవ్య నాతి చరామి అంటూ మంత్రాలు చదువుతారు. వధువు తండ్రి వరుడి చేత ఈ మంత్రాలు అనిపిస్తారు. అంటే నా కూతురిని నీ చేతిలో పెడుతున్నాను. ధర్మరక్షణలోనూ డబ్బు సంపాదనలోనూ కోరికలు తీర్చడంలోనూ నా కూతురుతో కలిసి నడవాలి. ఆమె అభిప్రాయాలకు విలువ ఇస్తూ మసలు కోవాలి అని చెబుతారు. పెళ్లి నాడే ేసిన ప్రమాణాలతో మన బంధం ముడిపడిపోతోంది. ఇక సంసారమనే సాగరంలో వారిద్దరిదే ప్రయాణం. కొడుకులు, కూతుళ్లు వస్తారు పోతారు కానీ కలకాలం మనకు తోడు నీడగా నిలవాల్సింది భార్యనే అనే విషయం తెలుసుకోవాలి.
పెళ్లినాటి ప్రమాణాల ప్రకారం మగాడు భార్యను తన జీవనంలో సగభాగం చేసుకోవాలి. అన్నింట్లో ఆమెతో పాటే నడవాలి. అంతే కాని నేను ఎక్కువ నీవు తక్కువ అనే భేదాభిప్రాయాలు వస్తే మనుగడ కష్టమే. భేషజాలకు పోకుండా ఒకరికొకరు అండగా నిలవాలి. అన్ని విషయాల్లో అరమరికలు లేకుండా మసలుకోవాలి. అన్యోన్యంగా జీవనం కొనసాగించాలి. అందరికి ఆదర్శప్రాయంగా భార్యాభర్తల బంధాన్ని కలకాలం నిలుపుకోవాలి. అచెంచల విశ్వాసంతో ముందుకెళ్లాలి. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా అవధులు లేని అవరోధాలు రాని విధంగా తమ కాపురం కొనసాగించేందుకు అన్ని మార్గాలు సద్వినియోగం చేసుకుని మంచి భార్యాభర్తలు అనిపించుకోవాలి. దాని కోసమే వారి బంధాన్ని కలకాలం కల్లలు లేని సంసారంగా మార్చుకోవాలి.
Also Read:Vizag Colony Tourism: ఇటు నల్లమల.. అటు నాగార్జున సాగరం.. నడమ అందాల ‘వైజాగ్ కాలనీ’