Child Care : పిల్లలకు స్నానం చేయించిన తర్వాత వెంటనే చేసే పని టాల్కమ్ పౌడర్ ను వేస్తుంటారు చాలా మంది తల్లులు. ఇలా చేస్తే తమ పిల్లలు ఫ్రెష్‌గా ఉంటారని భావిస్తుంటారు. అయితే టాల్కమ్ పౌడర్ వంటి సౌందర్య ఉత్పత్తులు క్యాన్సర్ వంటి ఉత్పత్తులు కారణం అవుతాయి అంటున్నారు నిపుణులు. ఇందులో ఆస్బెస్టాస్ అనే మూలకం ఉంటుందట. దీని వ్లలనే క్యాన్సర్ వస్తుందట. ఇది పిల్లలకు హానికరమట. అయితే ఈ టాల్కమ్ పౌడర్ వినియోగంపై నిపుణులు ఎలాంటి విషయాలు చెబుతున్నారు. ఈ టాల్కం పౌడర్ మీ పిల్లలకు ఎలా హానికరం అనే విషయాలు తెలుసుకుందాం.
అయితే ఇందులో టాల్క్ అనే మూలకం ఉంటుందట. దీన్ని భూమి నుంచి సేకరిస్తారట. ఇది తేమను గ్రహించి, ఘర్షణను తగ్గిస్తుందట. కాబట్టి కాస్మెటిక్ కంపెనీలు దీనిని బేబీ పౌడర్, ఐషాడో, ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా, ఆస్బెస్టాస్ టాల్కమ్ పౌడర్‌లో కూడా ఉంటుంది. దీన్ని కూడా టాల్క్ లాగా భూమి నుంచే సేకరిస్తారట. ఈ ఆస్బెస్టాస్‌ను శరీరంలోకి పీల్చుకుంటే, క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది అంటున్నారు నిపుణుల.
అందుకే ఇలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను వాడకూడదు అంటున్నారు నిపుణులు. టాల్కమ్ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు ఉండే అవకాశం ఉందని.. క్యాన్సర్‌పై పరిశోధన చేస్తున్నప్పుడు, టాల్కమ్ పౌడర్‌ను క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలుగా చేర్చారట. టాల్క్ కొన్ని కణాలు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కాకుండా, పిల్లలు టాల్కమ్ పౌడర్ కణాలను పీల్చినట్లయితే అప్పుడు ఊపిరితిత్తులు, శ్వాస కోశ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందట.
టాల్కమ్ పౌడర్, క్యాన్సర్ మధ్య సంబంధం వందశాతం స్పష్టంగా లేదని.. కానీ దీనికి మాత్రం దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు నిపుణులు. మీరు కూడా పిల్లలకు టాల్కమ్ పౌడర్ వేయాలనుకుంటే, వైద్యుల సలహా మేరకు నాన్-కాస్మెటిక్ పౌడర్ లను వాడటం మంచిది.