Omicron – Immunity Boost: మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వ్యాయామం చేయడం, చక్కని నిద్ర, జీవన శైలి, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలంటే విటమిన్ డి తప్పనిసరిగా అవసరం. ప్రతిరోజూ కొంత సమయం ఎండలో నిల్చొని ఉండటంతో పాటు విటమిన్ డిని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. శరీరానికి తగిన నిద్ర ఉంటే మాత్రమే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
నిద్రలేమి సమస్య వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. కంటినిండా నిద్రపోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించే అవకాశంతో పాటు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోజులో కనీసం 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. సరైన వ్యాయామాలు చేయడం ద్వారా ఎల్లప్పుడూ చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. పసుపు, తేనె, తులసి, క్రూసిఫర్‌లు, ఉసిరి, వెల్లుల్లి, అల్లం, గరం మసాలాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు జింక్, కాల్షియం ఉండే ఆహార పదార్థాలు తింటే మంచిది. వీలైనంత వరకు రోజులో ప్రశాంతంగా ఉండటం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. ప్రాథమిక ప్రాణాయామ వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.