https://oktelugu.com/

mosquitoes : దోమలు అందువల్లే మనుషులను కుడతాయట.. శాస్త్రవేత్తల ప్రయోగాలలో సంచలన విషయాలు

దోమలు మనుషులను కుడతాయి. రకరకాల వ్యాధులు వ్యాపించడానికి కారణమవుతాయి. అపరిశుభ్ర వాతావరణం, మొక్కలు విపరీతంగా పెరిగే ప్రాంతంలో దోమలు విస్తారంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆనారోగ్యానికి గురవుతుండడంలో దోమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2024 / 08:42 PM IST

    mosquitoes drink human blood

    Follow us on

    mosquitoes : దోమల వల్ల ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక జబ్బులు మాత్రమే కాకుండా జికా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి వ్యాధులు వస్తాయి. ఒక మనిషి శరీర వాసన వల్ల దోమలు కుడతాయని శాస్త్రవేత్తలు గతంలో చేసిన ప్రయోగాలలో తేలింది. అయితే దోమలు కుట్టడానికి శరీర వాసన మాత్రమే కాకుండా.. మనసులను బట్టి అవి ఆ పని చేస్తాయట. దోమలలో రహస్య ఆయుధం ఉంటుందట. ఇటీవల శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రయోగాలలో ఈ విషయం తెలిసింది. దీని ఇన్ ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్ అని పిలుస్తారు. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉష్ణోగ్రతలను దోమలు అత్యంత సులువుగా గుర్తిస్తాయట. అంతేకాదు తమకు 2.5 అడుగుల దూరంలో తమ టార్గెట్ ను అత్యంత సులువుగా గుర్తిస్తాయట.

    యాంటెన్నా ఎలా ఉంటుందంటే..

    దోమలకు శరీర సామర్థ్యం అధికంగా ఉంటుంది. దానికి తోడు ఇన్ ఫ్రారెడ్ ధార్మికతను అవి సులభంగా పసిగడతాయి. ఇదే విషయాన్ని అమెరికాలోనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల తన ప్రయోగాల ద్వారా తెలిపారు. ” దోమలు మనుషులను త్వరగా గుర్తిస్తాయి. ఈ డిస్ ఈజిప్టీ అన్ని రకాలకు చెందిన దోమల్లో మనుషులను కొట్టే సామర్థ్యం అధికంగా ఉంటుంది. వాటి యాంటెన్నా పై భాగంలో ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి. అవి ఇన్ఫ్రారేడ్ ధార్మికతను గుర్తిస్తాయని” కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. యాంటెన్నా లో టిఆర్పి ఏ -1 అని పిలిచే ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. అది వివిధ ఉష్ణోగ్రతలలో స్పందించే విధంగా దోమలకు సహకరిస్తుంది. యాంటెన్నా లో ఓపీ -1,.ఓపీ -2 అనే రోడోస్పిన్ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి దోమలకు పరారుణ గ్రహక సామర్థ్యాన్ని ఇస్తాయి. అందువల్ల దోమలు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ మనుషులను సులభంగా గుర్తించి కుడతాయి. ఇక ప్రపంచ జనాభాలో సగం మంది దోమల వల్ల వ్యాపించే వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్లో ఫీవర్, డెంగి, మలేరియా, టైఫాయిడ్, జికా వంటి వ్యాధులు దోమల వల్లే వస్తున్నాయి. అయితే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల వల్ల దోమల నివారణకు చేపడుతున్న ప్రయోగాలలో ముందడుగు పడనుంది. అయితే వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల శరీరం నుంచి వెలుపడే వరారుణ ఉన్న ధార్మికత చర్మానికి, దుస్తులకు మధ్య ఆగిపోతుంది. అది దోమకాటును తగ్గిస్తుందని.. ప్రస్తుతం ఇది ఒక్క మార్గమే శరణ్యంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దోమల నివారణకు కాయిల్స్, లిక్విడ్స్ వాడుతున్నారని.. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ హితంగా ఉన్న విధానాల ద్వారానే దోమలను కొద్దో గొప్పో నివారించడం మేలని పేర్కొంటున్నారు.