
Relationship:దాంపత్య జీవితంలో శృంగారం ప్రధానమైనది. ఆలుమగల మధ్య ఉండే బంధాల్లో శృంగారానిదే ప్రధాన భూమిక కావడం తెలిసిందే. దీంతో కాపురంలో దంపతుల మధ్య శృంగారంతోనే అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే కాపురం అనే నౌకకు శృంగారం అనేది తెడ్డులా ఉంటుంది. భార్యాభర్తల మధ్య శృంగారానికి ఉన్న విలువ అలాంటిది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే శృంగారంతోనే సాధ్యం. వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. శృంగారాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకే నష్టం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే మనకు ఎన్నో రకాల మేలు కలుగుతుంది.
మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. అందులో ఆర్థికం, భావోద్వేగం, లైంగికం సంబంధమైన బాధలు ఎన్నో ఉన్నాయి. వీటిలో లైంగిక బాధలు మాత్రం ఉంటే దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. లైంగిక సమస్యలతో బాధపడుతుంటే భాగస్వామిపై కూడా ప్రభావం పడుతుంది. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి రోగాలు కూడా వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వచ్చే ముప్పు పొంచి ఉంది. దీంతో శృంగారాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం భారీ మూల్యం చెల్లించాల్సిందే.
దాంపత్య జీవితంలో శీఘ్ర స్కలనం ఓ సమస్య. శృంగారంలో పాల్గొన్నప్పుడు త్వరగా స్కలనం అయ్యే పరిస్థితిని శీఘ్ర స్కలనం అంటారు. ఈ సమస్య ఉంటే జీవిత భాగస్వామి ఇబ్బందులకు గురవుతుంది. దీన్ని నుంచి బయట పడేందుకు ప్రాక్టీసు చేస్తే ఫలితం కనబడుతుంది. దీనికి సమయం పడుతుంది. సమస్యను పరిష్కరించుకోకపోతే ఇబ్బందులు ఏర్పడవచ్చు. సెక్స్ థెరపిస్టును కలిసి దాని నుంచి దూరం కావచ్చని చెబుతున్నారు. దంపతుల్లో గొడవలు రాకుండా ఉండాలంటే శృంగారమే రక్షగా నిలుస్తుంది.
చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అంగస్తంభన సమస్య కూడా ఒకటి. అంగానికి రక్తప్రసరణ కాకపోతే స్పందించదు. దీంతో అది గట్టిపడదు. అంగం గట్టిగా కాకపోతే శృంగారంలో పాల్గొనే సత్తా ఉండదు. దీనికి ప్రధాన కారణం మానసిక ఇబ్బందులు, డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడేవారికి లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. దీంతో కూడా వారు శృంగారంలో పాల్గొనలేరు. వీటిని అధిగమించాలంటే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
పురుషాంగం వంకరగా ఉంటే దాన్ని పెరోని వ్యాధి అంటారు. అంగం స్తంభించినప్పుడు కూడా వంకరగా ఉంటే శృంగారంలో పాల్గొనడం సాధ్యం కాదు. అంగం దిగువ, పై భాగంలో ఒక గడ్డ లాంటిది ఉండటంతో వంకరగా కనిపిస్తుంది. దీంతో సమస్యలు రావచ్చు. వైద్యులను సంప్రదించి దాని సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. మందులతో గడ్డలను కరిగించుకోవచ్చు. ఒకవేళ శస్త్ర చికిత్స కూడా చేసుకోవాల్సి రావచ్చు. అంగస్తంభన సమయంలో ఇలాంటి సమస్య ఉన్న వారికి ఇబ్బందులు ఏర్పడవచ్చు.
శృంగార సమస్యలను అధిగమించి జీవిత భాగస్వామితో సంతోషకరమైన విధంగా జీవితాన్ని గడపొచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండేందుకు శృంగారమే పరిష్కారాలు తీసుకొస్తుంది. దీంతో దంపతులు తమ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.