Winter: ప్రస్తుతం చలికాలం కాబట్టి వాతావరణంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఉదయం పూట, రాత్రి సమయాన చలి ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ సమయంలో బయట ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ.
ముఖ్యంగా చిన్న పిల్లలకు మాత్రం ఈ కాలం చాలా డేంజర్ అని చెప్పవచ్చు. అధిక చలి తీవ్రత ఉండటం వల్ల పెద్ద వాళ్ళు బయటకు వెళ్లడానికి వణికిపోతున్నారు. అటువంటిది పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి.
ఈ కాలంలో పిల్లలు చలికి గురైతే వారికి వెంటనే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవటం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక కొందరు తల్లిదండ్రులు ఇవి చిన్న చిన్న జబ్బులే అని హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ ద్వారా ప్రయోగిస్తూ ఉంటారు.
Also Read: జుట్టు తెల్లబడటం మొదలైందా.. ఈ జాగ్రత్తలతో సమస్యకు సులువుగా చెక్!
కొన్ని సమయంలో అవి పనిచేయవు. దీనివల్ల అలాగే నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియా వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కాబట్టి పిల్లలకు జలుబు, దగ్గు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లాలి.
ముందుగానే పిల్లలకు ఇటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే.. వారిని చల్లగాలిలో తిప్పకూడదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంచి చలి నుంచి రక్షణగా కాపాడాలి. వారి శరీరంను, తలను, చెవులను స్వెటర్ లతో, క్యాప్ లతో కప్పివేయాలి.
వారికి వేడి వేడి ఆహార పదార్థాలను తినిపిస్తూ ఉండాలి. వేడి చేసిన నీటిని అందివ్వాలి. కొంత వరకు ఇటువంటి రక్షణ తీసుకుంటే మాత్రం కొన్ని సమస్యలు దరిచేరవు.
Also Read: మరోసారి బిర్యానీకే జై కొట్టిన హైదరాబాద్.. ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరగిందట..