Homeలైఫ్ స్టైల్Sweet Potato Benefits: చలికాలంలో మాత్రమే తినే ఈ దుంప గురించి తెలిస్తే ఆగలేరు..

Sweet Potato Benefits: చలికాలంలో మాత్రమే తినే ఈ దుంప గురించి తెలిస్తే ఆగలేరు..

Sweet Potato Benefits: ఏ కాలంలో లభించే పండ్లు ఆ కాలంలో తినాలని అంటారు. వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా కొన్ని పండ్లు ప్రత్యేక కాలంలోనే లభిస్తాయి. ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇవి అందుబాటులోకి రావడంతో పూర్వ కాలం నుంచి చాలా మంది వీటిని కాలానికి అనుగుణంగా తినేవారు. ఉదాహరణకు వేసవిలో ఎక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉండే కర్బూజ, దోసకాయ లాంటివి ఎక్కువగా వస్తాయి. అలాగే చలికాలంలో ఎక్కువగా మార్కెట్లోకి వచ్చే ఆహార పదార్థం ఏది? దానిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

వింటర్ సీజన్ మొదలవగానే చాలా మంది శరీరం చల్లబడిపోతుంది. దీంతో విపరీతమైన వణుకు పుడుతుంది. ఈ క్రమంలో శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుకునేందుకు, చలి నుంచి తట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చలికాలంలో ఊళ్లల్లో ఉండేవాళ్లు మంట పెడుతూ వేడిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. సిటీల్లో ఉండేవారు స్వెటర్లు వేసుకుంటూ ఉంటారు. అయితే చలికాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ముఖ్యంగా చలికాలంలో మాత్రమే తినే పదార్థం ఏంటంటే?

చిలకడ దుంప. దీనినే స్వీట్ పొటాటో అంటారు. చలికాలం మధ్యలో ఇది మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంది. అప్పటి నంచి వేసవి కాలం ప్రారంభం వరకు మార్కెట్లో విచ్చలవిడిగా కనిపిస్తుంది. చిలకడ దుంపను ఇప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ పూర్వ కాలంలో దీనిని కొన్ని రోజుల పాటు రోజూవారీ ఆహారంలో భాగంగా దీనిని తప్పనిసరిగా తీసుకునేవాళ్లు. అయితే ఇందులో ఉండే ప్రయోజనాలు తెలిస్తే ఇప్పటి వారు కూడా విడిచిపెట్టరు.

చలికాలంలో మాత్రమే మార్కెట్లోకి వచ్చే చిలకడదుంప తినడం వల్ల శరీరం హీటెక్కుతుంది. ఇందులో బీటా కెరోటిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ప్రోస్టేట్, ఆండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఇది మార్కెట్లో ఉన్నంతకాలం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.

చిలకడదుంపలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో తక్కువ తీసుకున్నా ఎక్కువ శక్తి వస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు దీనిని తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా చిలకడ దుంపలు ఎంతో సహాయపడుతాయి. ఇక గర్భిణులకు చిలకడ దుంపుల దివ్వౌషధంలా పనిచేస్తాయి. వీరు తీసుకోవడం వల్ల కడుపులో పెరిగే బిడ్డకు పోషకాలు అందించిన వారవుతారు. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకున్న తరువాతే తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version