https://oktelugu.com/

Hot Water Benefits: వేసవికాలంలో వేడినీటి స్నానం ఆరోగ్యానికి మంచిది కాదా.. వాస్తవాలు ఇవే!

Hot Water Benefits: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. వేసవి తాపం వల్ల ఎండలో కొంత సమయం ఉన్నా చెమటలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వేసవికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చాలామంది భావిస్తారు. వేసవికాలంలో చన్నీటి స్నానానికే ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే వేసవికాలంలో చన్నీటి స్నానంతో పోల్చితే వేడినీటి స్నానం ఆరోగ్యానికి మంచిది. వేసవికాలంలో చాలామందిని తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు […]

Written By: , Updated On : March 23, 2022 / 03:45 PM IST
Follow us on

Hot Water Benefits: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. వేసవి తాపం వల్ల ఎండలో కొంత సమయం ఉన్నా చెమటలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వేసవికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చాలామంది భావిస్తారు. వేసవికాలంలో చన్నీటి స్నానానికే ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే వేసవికాలంలో చన్నీటి స్నానంతో పోల్చితే వేడినీటి స్నానం ఆరోగ్యానికి మంచిది.

Hot Water Benefits

Hot Water

వేసవికాలంలో చాలామందిని తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు వేధిస్తాయి. వేసవిలో వేడినీటి స్నానం చేయడం ద్వారా ఈ సమస్యలను సులభంగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మహిళలకు ఋతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు సైతం వేడి నీటి స్నానం చెక్ పెడుతుందని చెప్పవచ్చు. చన్నీటి స్నానం కంటే వేడినీటి స్నానం వల్లే చర్మం మెరుగ్గా శుభ్రపడుతుందని చెప్పవచ్చు.

Also Read: Naga Chaitanya- Samantha: స‌మంత ఫాలో కాక‌పోయినా.. ఇన్ స్టాలో ఆమెను ఫాలో అవుతున్న చైత‌న్య.. కార‌ణం ఇదే..!

వేడి నీళ్ల వల్ల శ్వేద రంద్రాలు తెరుచుకునే అవకాశంతో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు, మచ్చలు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర వస్తుంది. వేడినీటితో స్నానం చేయడం వల్ల దగ్గు, తుమ్ములు, ఇతర ఆరోగ్య సమస్యలు సైతం దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేసవిలో వేడినీటి స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వేసవిలో చాలామంది కండరాల నొప్పులతో, కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో వేడినీటితో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వేడినీటితో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Also Read: RRR Movie First Full Review and Rating: ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ