https://oktelugu.com/

Calotropis : ఈ కొన్ని ఆకుల ద్వారా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు..

Calotropis : ఈరోజుల్లో ఇంటికో మధుమేహ వ్యక్తి ఉంటున్నారు. వాతావరణ ప్రభావంతో పాటు తీసుకునే ఆహారంతో షుగర్ అటాక్ అవుతోంది. ఈ తరుణంలో షుగర్ కంట్రోల్ కోసం చాలా మంది మెడిసిన్స్ నిత్యం వాడుతుంటారు. ఈ క్రమంలో కొందరికి సైడ్ ఎఫెక్టయి అనేక వ్యాధులకు గురవుతున్నారు. అయితే కొందరు ఆయుర్వేద వైద్యులు కొన్ని పద్దతుల ద్వారా పెద్ద పెద్ద రోగాలను సైతం నయం చేస్తున్నారు. ఇందులో భాగంగా తీవ్రమైన షుగర్ ఉన్నవారు సైతం కొన్ని చిట్కాల ద్వారా […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 28, 2023 / 04:09 PM IST
    Follow us on


    Calotropis :
    ఈరోజుల్లో ఇంటికో మధుమేహ వ్యక్తి ఉంటున్నారు. వాతావరణ ప్రభావంతో పాటు తీసుకునే ఆహారంతో షుగర్ అటాక్ అవుతోంది. ఈ తరుణంలో షుగర్ కంట్రోల్ కోసం చాలా మంది మెడిసిన్స్ నిత్యం వాడుతుంటారు. ఈ క్రమంలో కొందరికి సైడ్ ఎఫెక్టయి అనేక వ్యాధులకు గురవుతున్నారు. అయితే కొందరు ఆయుర్వేద వైద్యులు కొన్ని పద్దతుల ద్వారా పెద్ద పెద్ద రోగాలను సైతం నయం చేస్తున్నారు. ఇందులో భాగంగా తీవ్రమైన షుగర్ ఉన్నవారు సైతం కొన్ని చిట్కాల ద్వారా జీరోస్థాయికి వస్తుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఆ చిట్కాలేంటో చూద్దాం.

    జిల్లేడు చెట్టు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. పూజా కార్యక్రమాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే షుగర్ కంట్రోల్ కావడానికి జిల్లేడు ఆకులు మంచి ఔషధం అని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఆకుల ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చని అంటున్నారు. అయితే వీటిని ఒక విధానం ద్వారా వాడడం వల్లనే అది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ ఆకులను ఎలా వాడాలో తెలుసుకుందాం.

    జిల్లేడు చెట్టు నుంచి ఆకులను తెంపడం ద్వారా ఆ ఆకులకు పాలు వస్తాయి. దీంతో చేతులు జిగటా మారుతాయి. దీంతో ఈ ఆకులను బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన ఆకుల్లో కొన్నింటితో అరికాలపై మర్దన చేయాలి. అలా చేసిన తరువాత మరికొన్ని ఆకులను తీసుకొని అరికాలుపై దారంతో కట్టుకోవాలి. అలా ఆకులు పడిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే ఆకులను కట్టిన తరువాత అలాగే వదిలేస్తే అందులోకి క్రిములు చేరే ప్రమాదం ఉంది. అందువల్ల వాటిపై సాక్సులు ధరించాలి. సాక్షులు ధరించిన తరువాత అవసరమైతే చెప్పులు వేసుకొని అటూ ఇటూ నడవొచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

    మధుమేహ గ్రస్తులు ఎలాంటి వైద్యమైన ఆరికాళ్ల ద్వారానే చేస్తారు. కొందరు షుగర్ ఫ్రీ చెప్పులు వేసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుందని భావిస్తారు. అలాగే జిల్లేడు ఆకులను అరికాళ్లపై ఉంచడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని నమ్మని వారు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకొని ఈ ఆకులను ఒకరోజు అలా కట్టుకున్న తరువాత మరుసటి రోజు షుగర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఎంతటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చని అంటున్నారు.